Movie News

పవన్‌ ఫ్యాన్స్ ముందు వద్దంటారు కానీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల టైంలో సినిమాలకు టాటా చెప్పేస్తున్నట్లు ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్. కానీ రెండేళ్ల విరామం తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి సినిమాల్లోకి రావడంతో హమ్మయ్య అనుకున్నారు. పవన్ రీఎంట్రీ ఇవ్వడం సంతోషమే కానీ.. ఆయన తమ ఆకాంక్షలకు తగ్గ సినిమాలు చేయట్లేదన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంది. పవన్ వరుసబెట్టి రీమేక్ సినిమాలు చేస్తుండటం..

వాటిలోనూ మాస్ మసాలా అంశాలు తక్కువ ఉండటం వారికి నిరాశ కలిగిస్తోంది. ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న వార్త బయటికి వచ్చినపుడు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు చేశారు. కానీ తర్వాత తర్వాత వారి ఆలోచన మారిపోయింది.

ఆ కథకు కమర్షియల్ టచ్ ఇచ్చి.. పవన్‌ను వీలైనంత మాస్‌గా చూపించడానికి జరిగిన ప్రయత్నంతో అభిమానులు సంతృప్తి చెందారు. చివరికి ఆ సినిమాను బాగానే ఓన్ చేసుకున్నారు. ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. మళ్లీ రీమేకా.. అది కూడా మాస్ మసాలా అంశాలు లేని సినిమానా అంటూ నిట్టూర్చారు. కానీ చివరికి ఆ సినిమాను కూడా ఓన్ చేసుకున్నారు. అంతిమంగా అది కూడా అభిమానులను శాటిస్ఫై చేసింది.

ఇప్పుడిక ‘వినోదియ సిత్తం’ రీమేక్ విషయానికి వస్తే.. ఈ సినిమా వద్దే వద్దంటూ గోల గోల చేశారు పవన్ ఫ్యాన్స్. ఒక దశలో అభిమానుల వేదనను అర్థం చేసుకుని ఈ సినిమాను ఆపేసినట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత సీన్ మారింది. సినిమా పట్టాలెక్కింది. అంతవరకు సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు.. ఈ సినిమా షూట్ మొదలైనపుడు సైలెంట్ అయ్యారు.

ఈ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొస్తే ఇదేం టైటిల్ అన్నారు. కానీ చివరికి ఈ టైటిలే ప్రకటిస్తే సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తే.. ఒరిజినల్‌తో పోలిస్తే దీనికీ బాగానే కమర్షియల్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. యథాప్రకారం అభిమానులు ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఆటోమేటిగ్గా రిలీజ్ టైంకి ఈ సినిమాకు కూడా మంచి క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. పవన్‌లో ఉన్న మ్యాజిక్.. ఆయన అభిమానుల్లో ఉండే ఉత్సాహం అలాంటిది మరి.

This post was last modified on May 19, 2023 3:43 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

54 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago