Movie News

జనసేనకు ఊపిరినిచ్చే సినిమా?

పవన్‍కళ్యాణ్‍తో హరీష్‍ శంకర్‍ సినిమా వుంటుందని తెలిసిన దగ్గర్నుంచి ఫాన్స్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పవన్‍కళ్యాణ్‍ని అభిమానులు తెరపై ఎలా చూడాలని అనుకుంటారో హరీష్‍ శంకర్‍ అలాంటి సినిమా తీసి ‘గబ్బర్‍సింగ్‍’తో పవన్‍కళ్యాణ్‍ అంటే ఏమిటో మరోసారి బాక్సాఫీస్‍కి చూపించాడు. కమర్షియల్‍ మసాలాపై మంచి పట్టున్న హరీష్‍ మరోసారి పవన్‍తో అలాంటి మ్యాజిక్‍ చేస్తాడని ఫాన్స్ ఆశ పడుతున్నారు.

అయితే ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్‍కళ్యాణ్‍ పొలిటీషియన్‍గా కనిపిస్తాడని, ఒక సామాన్యుడు రాజకీయ నాయకుడైతే ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతుందో, అలాగే ఏ విధంగా అవినీతికి చరమగీతం పాడతాడో ఈ చిత్రంలో చూపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన మళ్లీ ఎన్నికలకు వెళ్లే సమయానికి ఈ చిత్రం వల్ల చాలా బెనిఫిట్‍ అవుతుందని కూడా అంటున్నారు.

అయితే గతంలో ఇలాంటి ప్రచారమే జరిగినపుడు తాను ఎలాంటి రాజకీయాల జోలికి పోవడం లేదని, పూర్తిస్థాయి కమర్షియల్‍ సినిమా తీస్తానని హరీష్‍ శంకర్‍ చెప్పాడు. ఆ తర్వాత హరీష్‍ నుంచి ఈ చిత్రం గురించిన అప్‍డేట్స్ ఏమీ లేకపోవడంతో మరోసారి కథాంశం గురించిన ఊహాగానాలు ఊపందుకున్నాయి.

This post was last modified on August 7, 2020 2:37 pm

Share

Recent Posts

రిటైర్మెంట్ వరకు ఊరట లేనట్టే.. సంజయ్‌కు మరో దెబ్బ!

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పార‌నో.. లేక ఆయ‌న మెప్పు పొందాల‌నో భావించిన కొంద‌రు ఉన్న‌తాధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారు.…

2 hours ago

పుణ్యం వస్తుంది ఇలాంటి ఆఫర్లు పెడితే

చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న ట్రెండ్…

3 hours ago

పెండింగ్ కేసులకు ఫాస్ట్ ట్రాక్.. ఏపీకి రానున్న ఈవెనింగ్ కోర్టులు..

దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…

4 hours ago

డేంజర్ గేమ్ ఆడుతున్న విశ్వంభర

ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర…

4 hours ago

తాత ఆస్తి నీకు రాదు మనవడా…

తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే…

5 hours ago

అప్పుడు షారుఖ్… ఇప్పుడు సూర్య

2000 సంవత్సరానికి ముందు రోజుల్లో ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా స్టార్ హీరోలు ఏడాదికి మూణ్నాలుగు…

5 hours ago