సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వారిలో అతని ప్రేయసి రియా చక్రవర్తి పాత్ర వుందో లేదో తెలియదు కానీ అతని తండ్రి అయితే ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేసాడు. ఈ కేసు సిబిఐ టేకప్ చేసే వరకు ఆయన విడిచిపెట్టలేదు. సిబిఐ ఈ కేసులో రియాను ప్రధాన నిందితురాలిగా పెట్టడంతో ఆమె అరెస్ట్ తప్పదని అంటున్నారు.
ఆమెని విచారించడానికి అయినా కస్టడీలోకి తీసుకుంటారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అతని మరణంలో రియా పాత్ర ఎంతో గానీ హీరోయిన్గా కెరియర్ అయితే పతనమైనట్టే. కనీసం ఇతర హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియా ప్రమోషన్లు చేసుకునే వీలు కూడా లేదు. ఆమె ఏదైనా పోస్ట్ పెట్టిందంటే ట్రోల్స్ ఆమెను ఆడేసుకుంటున్నారు.
హంతకురాలు, నయవంచకి అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ తనకు ఊపిరాడకుండా చేస్తున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చినా కానీ ఆమెని జనం మామూలుగా చూసే పరిస్థితి లేదు. మీడియా కోర్టులో ఆమెను ఆల్రెడీ హంతకురాలిగా తేల్చేసారు. ఇక ఆమె ఏదైనా సినిమాలో నటిస్తే ఆ చిత్రాన్ని ఏ విధంగా తొక్కేస్తారో ఊహించనలవి కాదు. జరిగిన పరిణామాలతో సుషాంత్ మరణంతో పాటు హీరోయిన్గా రియా కెరియర్ కూడా అంపశయ్య ఎక్కేసినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates