ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ప్రస్తావించిన పాపం పసివాడు సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తి కలిగింది. నిజంగానే ఇది ఆషామాషి మూవీ కాదు. ఓసారి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. ఈ చిత్రం 1972 సెప్టెంబర్ 29న విడుదలైంది. ఒక హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని వి రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందించారు. ప్రముఖ రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు స్క్రిప్ట్ రూపొందించారు. థార్ ఎడారిలో 27 రోజులు షూటింగ్ చేయడం అప్పట్లో సంచలనం.
టైటిల్ పాత్ర పోషించిన చైల్డ్ ఆర్ట్స్ రాముతో పాటు ముప్పై అయిదు మంది యూనిట్ సభ్యులు కలిసి జన వాసాలకు దూరంగా చిత్రీకరణ జరిపారు. ఫ్లైట్ యాక్సిడెంట్ లో మావయ్య చనిపోతే ఒంటరిగా మిగిలిన పసివాడు అడవిలో, ఎడారిలో ప్రమాదకరమైన జంతువుల నుంచి కాపాడుకుంటూ ఎలా బయట పడ్డాడనేది ఆద్యంతం థ్రిల్లింగ్ గా, గుండెలు పిండేసేలా చిత్రీకరించారు. ఎస్వి రంగారావు, సత్యనారాయణ, సూర్యకాంతం, నగేష్, చిత్తూరు నాగయ్య లాంటి సీనియర్ క్యాస్టింగ్ వల్ల సినిమా క్లాసిక్ గా నిలిచిపోయేంత గొప్పగా వచ్చింది. అల్లూరి శేషగిరిరావు నిర్మాత.
రిలీజయ్యాక ప్రమోషన్ల కోసం హెలికాఫ్టర్ల నుంచి పాంప్లెట్లు విసిరేయడం కథలుగా చెప్పుకున్నారు. సక్సెస్ టూర్లు చేశారు. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తల్లితండ్రులు, చిన్నారులు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి రావడం అప్పటి ఆడియన్స్ కి గుర్తే. 10 సెంటర్లలో వంద రోజులు ఆడటం పెద్ద విశేషం. అప్పటి మదరాసు ఇప్పటి చెన్నైలో గ్రాండ్ గా ఈవెంట్ కూడా చేశారు. తమిళ వెర్షన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. సత్యం సంగీతం, కన్నప్ప కెమెరా దన్నుగా నిలిచాయి. రాము స్టార్ కిడ్ అయ్యాడు. టాలీవుడ్ లో గుర్తుండిపోయే మాస్టర్ పీస్ పాపం పసివాడు
This post was last modified on May 17, 2023 3:06 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…