‘కార్తికేయ-2’తో గత ఏడాది అనూహ్య విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు నిఖిల్. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు. అదే.. స్పై. ‘కార్తికేయ-2’ అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది కానీ.. నిజానికి దాన్ని రిలీజ్‌కు ముందు ఎవరూ బహు భాషా చిత్రంగా గుర్తించలేదు.
ఆ సినిమా అనుకోకుండా హిందీలో ఘనవిజయాన్ని అందుకోవడం ‘స్పై’కి అడ్వాంటేజ్ అయింది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. తాజాగా ‘స్పై’ టీజర్ కూడా రిలీజైంది. ‘కార్తికేయ-2’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో పెద్ద బడ్జెట్లో భారీ స్థాయిలోనే ఈ సినిమాను తీర్చిదిద్దిన విషయం టీజర్ చూస్తే అర్థమైంది. ఐతే ఈ సినిమా కథాంశానికి.. తెలుగులో తెరకెక్కుతున్న మరో చిత్ర కథకు పోలికలు ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరూ భావించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయంలో అసలేం జరిగిందనే నేపథ్యంలో ఒక గూఢచారి చేసే సాహసాల నేపథ్యంలో ‘స్పై’ తెరకెక్కింది. కథ మొత్తంలో బోస్ కీలకంగా ఉంటాడని టీజర్లో చెప్పకనే చెప్పేశారు. ఐతే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘డెవిల్’ కథ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఐతే అది వర్తమానంలో నడిచే కథ కాదని.. పీరియడ్ ఫిలిం అని చెబుతున్నారు.
అందులో కూడా హీరో గూఢచారే.. అక్కడ కూడా కథ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇండస్ట్రీల ఈ రెండు కథల సారూప్యతల గురించి ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తోంది. ఐతే ‘స్పై’ టీజర్ లాంచ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో నిఖిల్‌కు దీని గురించే ప్రశ్న ఎదురు కాగా.. ‘డెవిల్’కు, తమ సినిమాకు సంబంధం లేదని తేల్చేశాడు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు అన్నాడు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ చర్చ ఆగట్లేదు.. ముందు రిలీజయ్యేది ‘స్పై’నే కావడంతో దాని వల్ల ‘డెవిల్’కు తలనొప్పి తప్పదని అంటున్నారు.
This post was last modified on May 17, 2023 12:00 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్‌లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…