Movie News

ధనుష్‌ది పెద్ద ప్లానింగే…

మొన్న భారీ ఎత్తున అభిమానులను ఒక చోటికి చేర్చి ఒక మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాడు తమిళ కథానాయకుడు ధనుష్. ముందు ఇది మామూలు కార్యక్రమమే అనుకున్నారు. కానీ అక్కడ ధనుష్ చేసిన ప్రసంగం.. అభిమానులను మోటివేట్ చేసిన వైనం.. వాళ్లతో స్టేజ్ మీద దండాలు పెట్టించుకున్న వైనం.. ఇదంతా చూశాక పెద్ద ప్లానింగే ఉందని అర్థమైంది.

ధనుష్‌కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం బలంగా ఉందని.. ఆ దిశగా వేసిన తొలి అడుగు ఇదని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఇంత హడావుడి చేయలేదు కానీ.. చాలా ఏళ్ల ముందే సైలెంటుగా అభిమాన సంఘాలను మోటివేట్ చేసి సంక్షేమ కార్యక్రమాల వైపు మళ్లించాడు. అవి శాఖోపశాఖలుగా విస్తరించాక రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ధనుష్ కూడా అదే బాటలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఐతే ధనుష్ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంద్నది ఆసక్తికరం. అతను సొంతంగా పార్టీ పెడతాడా.. లేదా ఏదైనా పార్టీలో చేరతాడా అన్న చర్చ మొదలైంది. బలమైన నాయకుడి కోసం చూస్తున్న బీజేపీ.. ధనుష్‌ను రంగంలోకి దించి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే ధనుష్ సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు.

కానీ అతడికి అంత ఫాలోయింగ్ ఉందా, తన బలాన్ని ఎక్కువ ఊహించుకుంటున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నో వివాదాలకు తోడు వేరే హీరోల అభిమాన సమూహాల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న ధనుష్‌‌కు సొంతంగా పార్టీ పెట్టి ప్రభావం చూపే స్థాయి ఉందా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే పదేళ్లు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తుండడమే ధనుష్‌లో ఆశలు రేగడానికి కారణమని అంటున్నారు. స్టాలిన్ ఆరోగ్యం అంత బాగా లేని నేపథ్యంలో ఆయన పార్టీని ముందుండి నడిపించే పరిస్థితి లేదు. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ మీద ఎవరికీ అంచనాలు లేవు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలవడం తప్పితే నాయకుడిగా అతను రుజువు చేసుకున్నదేమీ లేదు. కాబట్టి డీఎంకే రానురాను బలహీన పడడమే తప్ప దానికి భవిష్యత్తు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాట విజయ్ కాకుండా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న టాప్ స్టార్లలో రజినీకాంత్ రాజకీయ ప్రయాణం ఆరంభానికి ముందే ఆగిపోయింది. కమల్ ఫెయిల్యూర్ పొలిటీషియన్‌గా ముద్ర వేయించుకున్నాడు. అజిత్‌ ఎప్పటికీ రాజకీయాల్లోకి రాడు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టి విజయ్‌కి ఎదురుగా నిలబడి.. డీఎంకే స్థానాన్ని భర్తీ చేయాలని ధనుష్ ఆలోచనగా కనిపిస్తోంది.

అన్నాడీఎంకే ఆల్రెడీ బాగా బలహీనపడింది. పైగా విజయ్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు భాగమయ్యారు. ఈ నేపథ్యంలో ధనుష్ డీఎంకేకు ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టి తమిళ రాజకీయాల్లో ఒక శక్తిగా మారాలనే ప్రణాళికతోనే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇటీవలి మీటింగ్‌లో సందర్భోచితంగా తల అజిత్ డైలాగ్‌ను ధనుష్ ప్రస్తావించడంతో.. విజయ్‌కి వ్యతిరేకంగా తన ప్రయాణం ఉండబోతోందని చెప్పకనే చెప్పినట్లయింది.  

This post was last modified on July 28, 2026 2:53 pm

Share

Recent Posts

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

13 minutes ago

రిక్షా తోలుకోమంటున్న డిప్యూటీ సీఎం…

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…

60 minutes ago

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

2 hours ago

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

2 hours ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

3 hours ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

3 hours ago