సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులకు ఎక్కువ, క్యారెక్టర్ నటులకు తక్కువ అనిపించేలా కొందరుంటారు. వాళ్లు చాలా సినిమాల్లో కనిపిస్తారు కానీ.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండదు. ఊరికే తెరపైన ఉన్నారంటే ఉన్నారనిపిస్తారు. మొక్కుబడిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తారు. ఒకట్రెండుకు మించి వాళ్లకు డైలాగులుండవు. ఇలాగే వందల సినిమాల్లో నటించేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో మాత్రమే వారి పాత్రలు కొంత హైలైట్ అవుతుంటాయి.
ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించిన పావలా శ్యామల కూడా ఈ కోవకు చెందిన నటే. ఆమె తెలుగులో వందల సినిమాల్లో నటించారు కానీ.. అందులో ఒక పది చిత్రాల పేర్లు చెప్పమన్నా కష్టమే. అందుక్కారణం.. ఆమె చాలా వరకు చేసినవన్నీ చిన్న చిన్న పాత్రలే. ఇలాంటి పాత్రలు చేసే వాళ్ల పేర్లు కూడా జనాలకు తెలియవు. ఇలా ప్రేక్షకుల్లో తమ పేరు కూడా రిజిస్టర్ కాకుండానే కెరీర్‌ను ముగించిన నటులు చాలామంది ఉన్నారు.
కానీ పావలా శ్యామల మాత్రం కొన్ని చిన్న పాత్రలతోనే బలమైన ముద్ర వేశారు. ఆమెకు తొలిసారి బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర అంటే.. ‘ఆంధ్రావాలా’లో నిరాహార దీక్ష చేస్తున్న చోటికి మినిస్టర్ బ్రహ్మానందం వస్తే.. ఆయన వెంట పడి ఉక్కిరిబిక్కిరి చేసే పాత్ర. ఆ సినిమా డిజాస్టర్ అయినా ఆ సీన్ బాగా హైలైట్ అయింది. ఐతే దీన్ని మించి పావలా శ్యామలకు ఎక్కడలేని గుర్తింపునిచ్చి.. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యేలా చేసిన పాత్ర ఇంకోటింది. అదే ‘గోలీమార్’లో ఆమె చేసిన పనిమనిషి పాత్ర.
అందులో ఒక బిజినెస్‌మ్యాన్ ఇంట్లో పని చేసే ఆమెకు విలన్ చేసిన ఫోన్ కాల్ ఎత్తి.. తన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా, ఎదురు ప్రశ్నలు వేస్తూ విసిగిస్తుంది. ఆమె వల్ల ఫ్రస్టేట్ అయిన విలన్.. ఆ బిజినెస్‌మ్యాన్‌ను చంపేస్తాడు. తర్వాత హీరో వచ్చి.. మీ సేట్ నీవల్లే చనిపోయాడు తెలుసా అని పావలా శ్యామలతో అంటాడు. ఈ మొత్తం ఎపిసోడ్ భలే ఫన్నీగా ఉంటుంది. ‘గోలీమార్’ కూడా సరిగా ఆడకపోయినా.. సోషల్ మీడియాలో ఈ సీక్వెన్స్ కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. మీమ్ క్రియేటర్స్ దీన్ని బాగా వాడుతుంటారు. పావలా శ్యామలను జెన్‌జీకి కూడా కనెక్ట్ చేసిన సీన్ ఇది. ఆమె అంత పేరున్న కమెడియన్ కాకపోయినా.. ఈ ఒక్క సీన్‌తో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
This post was last modified on July 28, 2026 3:09 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…