Political News

లోకేష్‌కు షాక్ అనుకున్నారు.. కానీ!

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు.. రహదారులపై వచ్చారని, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా.. తల్లికి వందనం నిధుల గురించేనని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు.

గత ఎన్నికలకు ముందు వైసీపీ అమ్మ ఒడి పథకం అమలు చేసిందని.. ఆ సమయంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్.. అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా తాము వచ్చాక తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, తాజాగా తల్లికి వందనం పథకంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సొమ్ములు ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే పెనమలూరు పర్యటనలో మహిళలు రోడ్డెక్కారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. అన్యాయం చేసింది తాము కాదని.. వైసీపీనేనని ఆయన ఆరోపించారు.

వైసీపీ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా అన్యాయం చేసింది గొడ్డలి పార్టీ. కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడంతో సంతోషంతో వారు నా పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గొడ్డలి పార్టీ… అంగన్‌వాడీల ఈ కృతజ్ఞత ర్యాలీని, నిరసన ర్యాలీ అంటూ విష ప్రచారం చేస్తోంది. అని ఎద్దేవా చేశారు.

అడ్డంగా బుక్కయిన వైసీపీ

వాస్తవానికి పెనమలూరులో ఏం జరిగిందన్న విషయం ఆసక్తిగా మారింది. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్లకార్డులు పెట్టుకుని రోడ్లపై ఉన్న మాట నిజం. అయితే.. అది తల్లికి వందనం నిధులు జమ కోసం కాదు. ఎందుకంటే.. అప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చి అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

కానీ.. పెనమలూరులో మహిళలు.. తమ వేతనాలు పెంచాలని.. గత 5 ఏళ్లలో తమ వేతనాలు పెరగలేదని చెప్పేందుకు వచ్చారు. అయితే.. ఈ విషయం వైసీపీ వేరే కోణంలో చూపించి.. విమర్శల దాడి చేసి బుక్కయిపోయింది.

This post was last modified on July 28, 2026 2:33 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

57 minutes ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

1 hour ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

3 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

7 hours ago