ఒక హీరో హీరోయిన్ కలిసి నటించిన సినిమా హిట్ కాకపోయినా.. వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా దగ్గరై జంటగా మారిన ఉదంతాలు సినీ రంగంలో ఉన్నాయి. మహేష్ బాబు, నమ్రత జోడీ వంశీ అనే డిజాస్టర్ మూవీ మేకింగ్ టైంలో ఒకరికొకరు దగ్గరై తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాగే టాలీవుడ్లో మరో జంట ఒక్కటవబోతున్నట్లుగా చాన్నాళ్ల నుంచి చర్చ జరుగుతోంది.
మిస్టర్, అంతరిక్షం లాంటి ఫ్లాప్ సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటిదాకా వీళ్లిద్దరూ దీని గురించి ఓపెన్ అయింది లేదు. ఒక దశలో ఇద్దరూ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. తన కొడుక్కి అతి త్వరలో పెళ్లి చేయబోతున్నట్లు నాగబాబు చెబుతున్నాడు కానీ.. ఆ ఘడియలైతే ఇంకా రాలేదు.
ఐతే ఇప్పుడు వరుణ్, లావణ్య ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారని.. ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కూడా కుదిరిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో వరుణ్, లావణ్యలకు నిశ్చితార్థం కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.
లావణ్య.. మెగా ఫ్యామిలీలో జరిగిన కొన్ని వేడుకల్లో కనిపించడంతో వరుణ్‌కు ఆమెకు మధ్య ఏదో ఉందనే గుసగుసలు మొదలయ్యాయి. కానీ వరుణ్, లావణ్య కలిసి అయితే బయట ఎక్కడా కనిపించలేదు. వీరి మధ్య ఏమీ లేదని కొందరు కొట్టిపడేస్తున్నా.. తరచుగా ఈ జంట గురించి రూమర్లు అయితే ఆగట్లేదు. మరి ఈసారి ఏకంగా ఎంగేజ్మెంట్ అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 16, 2023 11:44 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…
రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవడం కీలకం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం…
"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…
నిన్న రాత్రి నుంచి ఏపీ తెలంగాణలో అఖండ 2 తాండవం థియేటర్లు జనాలతో నిండుగా కళకళలాడుతున్నాయి. సినిమా ఎలా ఉంది,…