ప్రియాంక చోప్రా ఇప్పుడు ఒక హాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుని ఇంటర్నేషనల్ సినిమాలు, సిరీస్‌ల్లో అవకాశాలు దక్కించుకుని గ్లోబల్ స్టార్ అయి ఉండొచ్చు. కానీ ఆమె ఒకప్పుడు సగటు బాలీవుడ్ హీరోయినే. తెలుగులో ఓ చిన్న సినిమాలో ఛాన్సొస్తే అందులోనూ నటించిందామె. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు కూడా నోచుకోలేదు. అలాంటి హీరోయిన్.. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లతో ప్రశంసలు దక్కించుకుని.. ‘ఆస్కార్’ పురస్కారాల్లో కూడా సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూడనే లేదట.
రాజమౌళి తెలుగు వాడని.. అందులో నటించిన హీరోలు కూడా తెలుగు వాళ్లని కూడా తెలిసి గతంలో ఆమె ‘ఆర్ఆర్ఆర్’ను తమిళ సినిమా అని పేర్కొని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడేమో తాను ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రియాంక చూసినా చూడకపోయినా ఓకే కానీ.. చూడలేదు అన్నాక అందుకు కారణం చెప్పిన కారణమే సిల్లీగా ఉంది.
తనకు ఈ సినిమా చూసే సమయం దొరకలేదని ఆమె అంది. తాను నిజానికి సినిమాలు పెద్దగా చూడనని.. ఇంట్లో ఖాళీగా ఉన్నపుడు టీవీ షోలు చూస్తానని తర్వాత ఆమె కవరప్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే.
పైగా అందులో ఆలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా నటించారు. రామ్ చరణ్ ఆమెకు ఒకప్పుడు కోస్టార్ కూడా. అలాంటి సినిమాను ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ప్రియాంక చూడకపోవడం.. అందుకు కారణం తనకు టైం లేదని చెప్పడం మరీ అతిగా అనిపిస్తోంది జనాలకు. కనీసం మూడు గంటల సమయం కూడా ఈ సినిమాకు కేటాయించలేని స్థాయిలో ఉన్నావా.. హాలీవుడ్ హీరోయిన్ అయిపోయావనే బిల్డప్పా అంటూ నెటిజన్లు ఆమె మీద కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on May 16, 2023 7:33 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…