కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి.. తెలుగు సినిమా వెలిగిపోతోందని, మన సినిమా గ్లోబల్ అయిపోయిందని తెగ సంబర పడిపోతుంటాం కానీ.. ఓవరాల్‌గా మన సినిమాల సక్సెస్ రేట్ ఏమంత పెరగలేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకూ ఆ రేట్ పడిపోతోంది. ప్రేక్షకులకు ప్రత్యామ్నాయ వినోదం పెరిగిపోయి.. పెద్ద కాన్వాస్ ఉన్న భారీ చిత్రాలకు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. మామూలు చిత్రాల్లో సూపర్ అనిపించుకుంటే తప్ప సినిమాలు థియేట్రికల్ సక్సెస్ రుచి చూడట్లేదు.
దీంతో నిర్మాతల పరిస్థితి రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో తపనతో, రాజీ లేకుండా సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లకు చేదు అనుభవాలు తప్పట్లేదు. శ్రీనివాస్ చిట్టూరి అనే మంచి నిర్మాత ఇప్పుడు ఇలాగే ఇబ్బంది పడతున్నాడు. ‘యు టర్న్’ అనే విభిన్నమైన సినిమాతో ఆయన నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
దీంతో తర్వాత కొంచెం పెద్ద స్థాయి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ నిర్మించారు. అది గోపీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ. ఈ సినిమాకు టాక్ పర్వాలేదు. ఓపెనింగ్స్ పర్వాలేదు. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. చివరికి లాస్ వెంచరే అయింది. ఇక గత ఏడాది శ్రీనివాసా ఇంకా పెద్ద సాహసం చేశాడు. రామ్ హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామిని నమ్మి పెద్ద బడ్జెట్లో ‘ది వారియర్’ తీశాడు. అది అయితే డిజాస్టర్ అయి నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది.
ఈ ఏడాది ‘కస్టడీ’తో అయినా కోలుకుంటాంలే అనుకుంటే.. అది కూడా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈసారి కూడా తమిళ దర్శకుడే ఆయనకు షాకిచ్చాడు. వెంకట్ ప్రభు తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాను నిర్మాతను నిలువునా ముంచాడు. ఎలాంటి నిర్మాత అయినా ఇలా వరుసగా డిజాస్టర్లు ఎదురైతే తట్టుకోవడం కష్టం. ఐతే ‘ది వారియర్’ పోయిందని రామ్.. తాను బోయపాటితో కమిటైన సినిమాను శ్రీనివాసాకే ఇప్పించాడు. మరి ఈ సినిమా అయినా బాగా ఆడి ఈ నిర్మాతను నిలబెడుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2023 5:35 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…