సినిమా హీరోయిన్లు కొందరు సినిమా వాళ్లనే పెళ్లాడితే.. కొందరు వ్యాపార వేత్తలతో జీవితాన్ని పంచుకుంటూ ఉంటారు. చాలా కొద్దిమంది మాత్రమే రాజకీయ నాయకులతో మూడు ముళ్ల బంధంలోకి వెళ్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఈ బాటనే ఎంచుకుంది. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్లు తమ ప్రేమాయణాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట.. కొంత కాలంగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొంచెం గ్యాప్ తర్వాత పెళ్లి కూడా ఉండొచ్చు. ఐతే ఒకప్పుడు తన పెళ్లి విషయంలో పరిణీతి చేసిన వ్యాఖ్యలు వింటే.. ఇప్పుడు జరుగుతున్నది చూసి షాకవకుండా ఉండలేం. గతంలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడనని తేల్చి చెప్పింది.
సినిమా రంగంలో పెళ్లాడాలని కోరుకునే వ్యక్తి అని అడిగితే.. ఆమె సైఫ్ అలీ ఖాన్ పేరు చెప్పింది. అతనంటే తనకు చాలా చాలా ఇష్టమని పేర్కొంది. మరి రాజకీయ రంగంలో ఎవరిని పెళ్లాడతావ్ అని అడిగితే.. ‘‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడను. అలా ఎప్పటికీ జరగదు’’ అని ఆమె తేల్చి చెప్పింది.
అప్పుడు అంత ఖరాఖండిగా చెప్పిన పరిణీతి.. ఇప్పుడు ఎంపీ అయిన రాఘవ్ చడ్డాను పెళ్లాడబోతుండటం చూసి.. పాత వీడియో బయటికి తీసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఉన్న అసహ్యం.. ఇప్పుడు ఎక్కడికి పోయింది.. ఇంతలో నీ మనసు ఎలా మారింది అంటూ ఆమెను నిలదీస్తున్నారు. కానీ మనిషి ఆలోచన ఎల్లపుడూ ఒకేలా ఉండకపోవచ్చు.. వ్యక్తుల మీద అభిప్రాయాలు మారొచ్చు కాబట్టి ఈ విషయాన్ని మరీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
This post was last modified on May 16, 2023 4:04 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…