మహేష్ 28 టైటిల్ మీద ఎడతెగని చర్చ

అసలు షూటింగ్ ఏ దశలో ఉందో తెలియకుండానే మహేష్ బాబు 28 మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ముందు అమరావతికి అటు ఇటు ప్రచారంలోకి వచ్చింది. తర్వాత లేదు గుంటూరు కారం అన్నారు. కట్ చేస్తే అసలు ఇవేవి కాదు కృష్ణ గారి ఎవర్ గ్రీన్ కమర్షియల్ హిట్ ఊరికి మొనగాడుని లాక్ చేయబోతున్నారని మరో టైటిల్ ప్రచారంలోకి తెచ్చారు.

నిజానికి మహేష్ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్ళాక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీటి మీద విపరీతమైన కసరత్తు చేస్తున్నాడు. అయితే సూపర్ స్టార్ దేనిపట్లా వంద శాతం సంతృప్తిని వ్యక్తం చేయలేదట. ఈ నెల 31 వస్తే కానీ ఈ సస్పెన్స్ కి తెరపడదు. ఎందుకంటే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ ని ప్లాన్ చేశారు. ఇది రావడం పక్కా. ఆలోగా పేరు డిసైడ్ చేయాలి. ఒకవేళ ఎంతకీ తెగకపోతే రామ్ బోయపాటి శీనులకు చేసినట్టుగా జస్ట్ మహేష్ 28 అని సరిపెట్టేస్తారు.

అ అక్షరంతో మొదలుకావాలని మాటల మాంత్రికుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కావడం లేదట. అతడే ఆమె సైన్యం పరిశీలనకు వచ్చినా అది కథకు సూట్ కాదనే ఉద్దేశంతో వద్దనుకున్నట్టుగా తెలిసింది. ఫ్యాన్స్ మాత్రం అతడు ఒక్కడు పోకిరి టైపులో మూడక్షరాల టైటిల్ కోరుకుంటున్నారు. రషెస్ పట్ల మహేష్ అంత సంతృప్తికరంగా లేడనే టాక్ వినిపిస్తోంది కానీ అదెంత వరకు నిజమో ఖచ్చితంగా చెప్పలేం.

మొదట్లో షూట్ చేసిన ఫైట్ ని పక్కనపెట్టేసి కథలో కీలక మార్పులు చేసిన త్రివిక్రమ్ అందరికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. అల వైకుంఠపురములో తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో చేస్తున్న సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ కావడం తనకూ అవసరం. కాకపోతే టైటిల్ కోసం ఇంత బుర్రబద్దలు కొట్టుకోవాల్సి రావడమే విచిత్రం. అత్తారింటికి దారేది టైంలో ఎదురుకున్న సమస్యే ఇప్పుడూ స్వాగతం పలుకుతోంది. కానీ త్రివిక్రమ్ మహేష్ మనసులో ఏముందో