గత ఏడాది విడుదలై ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచిన లైగర్ వల్ల కలిగిన నష్టాలకు న్యాయం చేయాలని హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూటర్లు తలపెట్టిన ధర్నా కొత్త మలుపు తీసుకుంటోంది. ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ స్వయంగా ఆ శిబిరానికి విచ్చేసి నిరసనలో పాల్గొంటున్న వాళ్లకు మద్దతు తెలుపడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా దృష్టి దీని మీద పడింది. హక్కులు అమ్మిన వరంగల్ శీను కనిపించడం లేదని తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్లాడని బయ్యర్లు చెబుతున్నారు. అందరూ ఊహించినట్టే ఫోన్లకు అందుబాటులో లేడు
ఇదంతా సులభంగా తేలే వ్యవహారం కాదు. త్వరలో పూరి డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టబోతున్నాడు. తనే నిర్మాత కాబట్టి ఇబ్బంది లేదు. పంపిణీదారులు అతనితో సినిమాలు తీయొద్దని ప్రొడ్యూసర్లకు విన్నపం చేసినప్పటికీ దాన్ని పట్టించుకోడు. ఎటొచ్చి హీరో రామ్ మీద ఒత్తిడి తెస్తే మాత్రం కథ ఇంకో మలుపు తిరగొచ్చు. ఈ సీక్వెల్ రిలీజ్ నాటికి నష్టాలకు సంబంధించి ఏదైనా హామీ ఇస్తే సమస్య ఉండదు. లేదంటే థియేటర్ల దగ్గర కొత్త పంచాయితీ షురూ అవుతుంది. పూరి, ఛార్మీ ఇద్దరూ లైగర్ ఫలితం వచ్చినప్పటి నుంచి బయట ఎక్కడైనా కనిపిస్తే ఒట్టు
ఇలాంటి కథలు ఇండస్ట్రీకి కొత్త కాదు. గతంలోనూ చాలా జరిగాయి. మృగరాజు నరసింహుడుతో మొదలుపెట్టి మొన్న ఏజెంట్ దాకా లెక్కలేనన్ని చూశాం. అయినా లైగర్ కు మాత్రమే నష్టపరిహారం ఎందుకు కోరుతున్నారనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సునీల్ నారంగ్ లాంటి బిగ్ షాటే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఇష్యూ సీరియస్ గానే చర్చకు దారి తీస్తుంది. ఒక ఫ్లాపుకు సంబంధించి హీరో నుంచి లైట్ బాయ్ దాకా ఎవరి రెమ్యునరేషన్లు వాళ్లకు ముట్టి తీరా ఫలితం తేడా జరిగినప్పుడు లాస్ మాత్రం మేము ఒక్కళ్ళే భరించాలానేది డిస్ట్రిబ్యూటర్ల ప్రశ్న. ఇదో అంతు లేని కథ అంతే
This post was last modified on May 15, 2023 4:28 pm
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఇవాళ పట్టుదల (విడాముయార్చి) విడుదలయ్యింది. దీనికి ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్…