Movie News

లిమిట్స్ దాటేసిన బోయపాటిరాపో ఛాలెంజ్

అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బోయపాటి శీను హీరో రామ్ తో చేస్తున్న సినిమా మీద మాములు అంచనాలు లేవు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మాస్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ ఈ మూవీ కోసమే బరువు పెరిగి మరీ అవతారం మార్చుకున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించి ఇవాళ రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. అసలు పేరు లేకుండా కేవలం హీరో దర్శకుడి కాంబోలో బోయపాటి రాపో అనే వీడియో రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకీ గ్లిమ్ప్స్ లో ఏముంది.

రామ్ పవర్ ఫుల్ లుక్స్ ని మాత్రమే రివీల్ చేశారు. విలన్ ని ఛాలెంజ్ చేస్తూ నీ గేటు దాటా స్టేటు దాటా ఇంకా ఏంట్రా లిమిట్సంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగుని చూపించారు. ఒక్క ఫ్రేమ్ లో శ్రీలీలని చూపించగా, చుట్టూ రౌడీ గ్యాంగ్ తప్ప ఇంకెవరినీ ఓపెన్ చేయకుండా తెలివిగా కట్ చేశారు. రామ్ మునుపెన్నడూ చూడని ఊర మాస్ వేషంలో మోటుగా ఉన్నాడు. విజువల్స్ గట్రా బోయపాటి రెగ్యులర్ స్టైల్ లో ఉన్నప్పటికీ లెజెండ్, సింహా టైపు మేకింగ్ తో మరోసారి తనదైన మార్కు మసాలా వినోదాన్ని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

బ్యాక్ గ్రౌండ్ లో తమన్ నేపధ్య సంగీతం సరైనోడు రేంజ్ లో బాగా ఎలివేట్ అయ్యింది. సంతోష్ ఛాయాగ్రహణం సమకూర్చారు అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ అనుకుంటున్నారో చిన్న లీక్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. హీరో పాత్ర పేరే పెట్టే పరిశీలన జరుగుతోందట. రెడ్ యావరేజ్ ఫలితం, వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ ఈ బోయపాటి రాపో మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడు. ఇది కనక సరిగ్గా వర్కౌట్ అయితే కేవలం ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ కాబోయే డబుల్ ఇస్మార్ట్ కు సానుకూలంగా ఉంటుంది.

This post was last modified on May 15, 2023 12:39 pm

Share

Recent Posts

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

1 minute ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

49 minutes ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

2 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

2 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

4 hours ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

4 hours ago