ప్రభాస్ , రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఛత్రపతి’ ను ఇన్నేళ్ల తర్వాత బెల్లంకొండ హీరోగా వినాయక్ హిందీలో రీమేక్ చేశారు. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా తాజాగా అక్కడ రిలీజైంది. అయితే తెలుగు వర్షన్ లో రాజమౌళి తీసింది తీసినట్టు ఉంచేసిన వీవీ వినాయక్ కొన్ని విషయాల్లో మాత్రం మార్పులు చేసుకున్నాడు. సినిమాలో ప్రభాస్ ఎంట్రీతో వచ్చే చేప ఎపిసోడ్ మొత్తం లేపేసి హీరో ఎంట్రీ డైరెక్ట్ గా చూపించేశాడు వినాయక్. ఆ ఎపిసోడ్ కి వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా చేయాలి బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుంది. అందుకే ఆ ఎపిసోడ్ లేపేశారు కాబోలు.
ఇక ఛత్రపతిలో లవ్ ట్రాక్ , అమ్మ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ హాఫ్ లో లవ్ ట్రాక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోయాడు వినాయక్. అలాగే సెకండాఫ్ లో భానుప్రియ -ప్రభాస్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసేశారు. వారిద్దరి మధ్య క్లైమాక్స్ లో వచ్చే “తెల్లనివన్నీ పాలని నల్లని వన్నీ నీళ్ళను అనుకున్నా” అనే సెంటిమెంట్ సాంగ్ ను లేపేశారు.
ఇలా కొన్ని మార్పులతో ఛత్రపతిను హిందీ ప్రేక్షకులకు అందించాడు వినాయక్. అలాగే ప్రీ క్లైమాక్స్ కి ముందు తనదైన శైలిలో ఓ సుమో ఛేజ్ పెట్టాడు. అది సెకండాఫ్ లో హైలైట్ అనిపించుకుంది. నార్త్ ఆడియన్స్ కి కావాల్సిన అన్నీ హంగులు ఇందులో సమకూర్చారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ , సాంగ్స్ వారి అభిరుచి మేరకు ఉన్నాయి. మరి ఈ రీమేక్ సినిమా బాలీవుడ్ ఎలా ఆకట్టుకుంటుందో ? బెల్లం కొండకి అక్కడ ఎలాంటి విజయం దక్కుతుందో ? చూడాలి.
This post was last modified on May 13, 2023 11:06 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…