టాలీవుడ్ దర్శక నిర్మాతలకున్న అతి పెద్ద సమస్య సంగీత దర్శకుల పరంగా పెద్దగా ఆప్షన్లు లేకపోవడం. తమన్ రేటుని అందరు భరించలేరు. దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఆల్బమ్ కి మంచి స్కోర్ ఇస్తాడని గ్యారెంటీ లేదు. పైగా రెమ్యునరేషనూ ఎక్కువే. మిక్కీ జె మేయర్ అన్ని జానర్లకు సూట్ కాడని రామబాణం ఋజువు చేసింది. మనం, ఇష్క్ నాటి మేజిక్ ని అనూప్ రూబెన్స్ ఇవ్వలేకపొతున్నాడు. అందుకే మన మేకర్స్ ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఖర్చు కొంచెం ఎక్కువైనా సరే బెస్ట్ సాంగ్స్ కోసం రాజీ పడటం లేదు
మల్లువుడ్ సెన్సేషన్ హేశం అబ్దుల్ వహాబ్ చేతిలో ఖుషి, నాని 30 ఉన్నాయి. మంచి అవుట్ ఫుట్ వస్తోందని ఆల్రెడీ టాక్ ఉంది. అనిరుద్ రవిచందర్ ఎంత బిజీగా ఉన్నా సరే ఎన్టీఆర్ 30, విజయ్ దేవరకొండ 12కు కమిట్ మెంట్ ఇచ్చాడు. దసరాతో హిట్టు కొట్టిన సంతోష్ నారాయణన్ ఏకంగా ప్రాజెక్ట్ కెని జేబులో వేసుకున్నాడు. ఇది కాకుండా వెంకటేష్ సైంధవ్ కూడా తోడయ్యింది. కస్టడీకి స్కోర్ ఇచ్చిన యువన్ శంకర్ రాజాకు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్ లో ఉంది. నితిన్ దర్శకుడు వక్కంతం వంశీ కాంబో కోసం హరీష్ జైరాజ్ ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు.
కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాధ్ కు దర్శకుడు అజయ్ భూపతి మంగళవారంకి ఒప్పించాడు. మరో రెండు డిస్కషన్ లో ఉన్నాయి. ఇలా మలయాళం, తమిళం, కన్నడ నుంచి ఇంపోర్ట్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ల నెంబర్ పెరుగుతూ పోతోంది. ఓపెనింగ్స్ విషయంలో పాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో హీరోలు గమనిస్తున్నారు. సరైన ఛార్ట్ బస్టర్ సాంగ్ ఒకటి రెండు పడినా చాలు హైప్ పెరగడంలో ఇవి దోహదపడుతున్నాయి. అందుకే ఎంత వ్యయమైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి తేక తప్పడం లేదు. పైగా పారితోషికాలు ఇక్కడున్నంత భారీగా ఎక్కడా ఉండవు
This post was last modified on May 12, 2023 11:02 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…