ఈ రోజుల్లో బహు భాషా చిత్రాలు బాగా పెరిగిపోయాయి. ఐతే ఈ సినిమాలు మొదలైనపుడు ద్విభాషా, బహు భాషా చిత్రాలుగా పేర్కొంటారు కానీ.. నిజంగా వాటిని వేర్వేరుగా ఆయా భాషల్లో తీస్తారన్నది సందేహమే. ప్రిన్స్, వారసుడు లాంటి సినిమాలను కూడా ముందు బైలింగ్వల్ అనే అన్నారు. తీరా చూస్తే తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేశారు అంతే. అక్కినేని నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించని ‘కస్టడీ’ సినిమాను కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నట్లు చెప్పారు. మరి వాళ్లయినా ఆ మాటకు కట్టుబడి ఉంటారా అన్న సందేహాలు కలిగాయి.
కానీ ఈ విషయంలో రాజీ పడలేదని వెంకట్ ప్రభు, నాగచైతన్య అంటున్నారు. ఏ భాషకు ఆ భాషలో వేర్వేరుగా ప్రతి సన్నివేశాన్నీ తీశారట. అంతే కాదు.. కొన్ని పాత్రలకు వేర్వేరుగా నటీనటులను కూడా తీసుకున్నారట.
ఉదాహరణకు తమిళంలో ఒక ముఖ్య పాత్రను దర్శకుడు వెంకట్ ప్రభు తమ్ముడు ప్రేమ్ జీ అమరన్ చేశాడు. వెంకట్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘చెన్నై 28’ నుంచి ప్రతి సినిమాలోనూ ప్రేమ్‌జీకి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ప్రేమ్‌జీని వెంకట్ వాడుకున్నట్లు తమిళంలో ఇంకెవ్వరూ వాడుకుని ఉండరు. తన సినిమాల్లో తమ్ముడి పాత్రను భలే ఎలివేట్ చేస్తుంటాడు వెంకట్. ‘కస్టడీ’లోనూ అతడికి ఒక ప్రత్యేక పాత్ర ఇచ్చాడు.
ఐతే ప్రేమ్ జీ మన వాళ్లకు పెద్దగా పరిచయం లేదన్న ఉద్దేశంతో ఇక్కడ పాపులర్ అయిన వెన్నెల కిషోర్‌తో ఆ పాత్ర చేయించారట. అలాగే మరి కొన్ని చిన్న చిన్న పాత్లకు కూడా వేర్వేరుగా నటీనటులను పెట్టి ఆయా భాషల్లో తెరకెక్కించారట. టైం దొరక్క వేరే భాషల్లో ‘కస్టడీ’ని రిలీజ్ చేయట్లేదు. తెలుగు, తమిళంలో స్పందనను బట్టి వేరే లాంగ్వేజెస్‌లో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ శుక్రవారమే ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 12, 2023 7:44 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…