సినీ రంగంలో ఉన్న వాళ్లకు కూడా సినీ ఫక్కీలో ప్రేమలో పడటం.. ప్రేమాయణం గురించి తెలిసి ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కోవడం.. కొంచెం నాటకీయ రీతిలో పెళ్లి చేసుకోవడం లాంటి అనుభవాలు ఉంటాయి. టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రేమ పెళ్లి విషయంలో మరీ నాటకీయతో, ఇబ్బందులు లేకపోయినా.. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయట.
వెన్నెల కిషోర్ నిర్వహిస్తున్న టీవీ షోకు తన భార్య స్పందనతో కలిసి అతిథిగా వచ్చిన సందర్భంగా మారుతి ఆ సంగతులు కొన్ని పంచుకున్నారు. స్పందనతో తనది ప్రేమ పెళ్లే అని.. ఐతే తమ ప్రేమాయణం బయటపడకుండా అన్నీ బాగానే మేనేజ్ చేసినా.. స్పందనకు డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల తామిద్దరం దొరికిపోయామని వెల్లడించాడు మారుతి.
మారుతి నిజానికి స్పందన కంటే ముందు ఆమె తల్లిని కలిశారట. మచిలీపట్నంలో జూనియర్ జేసీ వింగ్ అనే క్లబ్‌లో స్పందన తల్లి చురుగ్గా ఉండేవారని.. అక్కడ ఆమె పరిచయం కాగా.. తర్వాత ఓ డిన్నర్లో స్పందనతో పరిచయం జరిగిందని.. ఆమె చదివే స్కూల్ పక్కనే తన స్టిక్కరింగ్ షాప్ పెట్టానని.. నెమ్మదిగా తమ పరిచయం ప్రేమగా మారిందని మారుతి వెల్లడించాడు.
తామిద్దరం ప్రేమలో పడేటపుడు స్పందన పదో తరగతి చదువుతోందని మారుతి చెప్పగా.. కాదు ఎనిమిదో తరగతే అని స్పందన వారించడం విశేషం. ఇక డైరీ ట్విస్టు గురించి చెబుతూ.. ‘‘నేను తనతో ప్రేమలో పడ్డాక హైదరాబాద్ వచ్చేశాను. స్పందన వాళ్లు విజయవాడ వెళ్లారు. తను నన్ను ఎప్పుడు కలిసింది.. ఎప్పుడు మాట్లాడింది అన్నీ డైరీలో రాసేది. మేమిద్దరం దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వాళ్లకు ల్యాండ్ ఫోన్ ఉండేది. మాకు లేదు. అందుకే ఇద్దరం కలిసి సెల్ ఫోన్లు కొన్నాం. కానీ నాకు కాల్ చేసిన విషయం కూడా ఆమె డైరీలో రాసేది. వాళ్లింట్లో వాళ్లు అది చూడటంతో మా ప్రేమ విషయం బయటపడిపోయింది. పెళ్లి విషయంలో మేం మరీ ఇబ్బందులు ఎదుర్కోలేదు’’ అని మారుతి తెలిపాడు.
This post was last modified on May 12, 2023 7:42 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…