అక్కినేని నాగార్జున గతంలో బహు భాషా దర్శకులతో పని చేశాడు. తమిళం నుంచి కూడా పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు తీశారు. ఇదే కోవలో వెంకట్ ప్రభు సైతం నాగ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట. ప్రస్తుతం నాగ్ కొడుకు నాగచైతన్యతో ఆయన ‘కస్టడీ’ తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దర్శకుడితో నాగ్ సినిమా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో అది క్యాన్సిల్ అయిందట.
దాని గురించి వెంకట్ ప్రభు మీడియాకు వివరిస్తూ.. ‘‘నేను తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అజిత్ గారితో తీసిన ‘మన్కాతా’ సినిమాను తెలుగులో సమాంతరంగా నాగార్జున గారితో చేయడానికి సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. తర్వాత ‘మానాడు’ సినిమాను కూడా ఒకేసారి తెలుగులో వేరే హీరోగా చేయాాలనుకున్నా. కానీ అదీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ‘కస్టడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా’’ అని వెంకట్ తెలిపాడు.
‘కస్టడీ’ సినిమా కథకు స్ఫూర్తి ఒక మలయాళ చిత్రం అని చెబుతూ.. చైతూనే ఎందుకు ఇందులో లీడ్ రోల్ కోసం తీసుకున్నది వెంకట్ వెల్లడించాడు. ‘‘మలయాళంలో నాయట్టు సినిమా నాకు బాగా నచ్చింది. అందులో ప్లాట్ పాయింట్ చూసి స్ఫూర్తి పొందాను. ఆ పాయింట్‌తో ఒక కమర్షియల్ కోణంలో సినిమా ఎందుకు తీయకూడదు అని ‘కస్టడీ’ కథ రాశాను. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఒక పాట చూస్తుంటే నా పాత్రకు చైతూనే సరిపోతాడు అనిపించి అతడికి కథ వినిపించాను. తనకు నచ్చి ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడదామనుకున్నా. కానీ చైతూ వద్దన్నాడు’’ అని తెలిపాడు.
This post was last modified on May 11, 2023 12:50 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…