ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ ఒక వైపుంటే.. అజిత్ కుమార్ ఇంకో వైపున ఉంటాడు. అతను తన సినిమాలను ఆఫ్ లైన్లో కానీ, ఆన్ లైన్లో కానీ ఏమాత్రం ప్రమోట్ చేయడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడు. సోషల్ మీడియాలోకి అడుగే పెట్టడు. ఇక అభిమానులతో అజిత్‌కు అసలు చిన్న కనెక్షన్ కూడా ఉండదు.
ఎంత ప్రచారానికి దూరంగా ఉండే హీరో అయినా సరే.. అభిమానులతో కనెక్ట్ అయి ఉంటూ తన పీఆర్ టీం ద్వారా అభిమాన సంఘాలను మొబిలైజ్ చేయడం లాంటివి చేస్తాడు కానీ.. అసలు ఈ అభిమాన సంఘాలే వద్దు అని తేల్చేయడం అజిత్‌కే చెల్లింది. ఇక అజిత్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే.
ఆయనకు మోటార్ స్పోర్ట్స్ మీద అమితాసక్తి ఉంది. అప్పుడప్పుడూ సినిమాలకు సెలవిచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్లి మోటార్ స్పోర్ట్స్ రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. మోటార్ స్పోర్ట్స్ డ్రైవర్‌గా అజిత్ నైపుణ్యం కొన్ని సినిమాల్లో కూడా చూశాం.
ఇదంతా ఒకెత్తయితే.. అజిత్ ఇటీవల ఒక బైక్ వేసుకుని ఒక్కడే ఇండియా టూర్ వేసేశాడు. అధునాత స్పోర్ట్స్ బైక్ ఒకటి తీసుకుని అందులో కావాల్సిన సరంజామా అంతా పెట్టుకుని.. అజిత్ ప్రచారానికి దూరంగా తన పని తాను చేసుకుపోయాడు. వెంట సహాయకులు ఉండి ఉండొచ్చు కానీ.. ఇలా ఒక స్టార్ హీరో బైక్ వేసుకుని ఇండియా టూర్ వేయడం అన్నది అనూహ్యమైన విషయం.
ఇండియాలో ప్రతి స్టేట్ కవరయ్యేలా ఈ టూర్ ప్లాన్ చేశాడట. ఐతే అప్పుడే అంతా అయిపోలేదు. టూర్‌లో ఒక దశ పూర్తయింది. కొన్ని రాష్ట్రాలు కవర్ చేశాడు. ‘తునివు’ సినిమా తర్వాత వచ్చిన బ్రేక్‌లో అజిత్ ఈ టూర్ మొదలుపెట్టాడు. త్వరలో ఆయన కొత్త సినిమా ‘విడా ముయిర్చి’ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఆ సినిమాను పూర్తి చేశాక తర్వాతి దశ మొదలవుతుంది. ఫస్ట్ స్టేజ్ టూర్ నడుస్తుండగా ఈ విషయం అభిమానులకు తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు బయటికి రాగా.. ఇలా ఇండియాలో అజిత్ మాత్రమే చేయగలడు అంటూ కొనియాడుతున్నారు.
This post was last modified on May 10, 2023 3:18 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…