నాంది లాంటి సక్సెస్ ఫుల్ కాంబోలో తెరకెక్కిన ఉగ్రం మీద రిలీజ్ కు ముందు చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి. మొదటి రోజు టాక్ ఎక్కడా నెగటివ్ గా రాలేదు. రివ్యూలు బాగానే ఉందని మంచి ప్రయత్నం చేశారని మెచ్చుకున్నాయి తప్ప రామబాణం లాగా యునానిమస్ గా బాలేదని తీర్పు ఇవ్వలేదు. ఇన్ని సానుకూలతలు ఉన్నా జనాన్ని థియేటర్లకు పెద్ద మొత్తంలో రప్పించేందుకు అల్లరోడి బలం సరిపోలేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. అయిదు రోజులకు ఉగ్రం వసూలు చేసిన మొత్తం సుమారు 2 కోట్ల 60 లక్షల షేరట. గ్రాస్ ఆరు కోట్లకు చేరువలో ఉంది.
ఇంకో నాలుగు కోట్ల దగ్గరగా షేర్ వస్తే తప్ప ఉగ్రం బ్రేక్ ఈవెన్ కాదు. అంటే రెట్టింపు గ్రాస్ రావాలి. మరీ సీరియస్ సబ్జెక్టు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఉగ్రం వైపు మొగ్గు చూపడం లేదన్నది స్పష్టం. మాస్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ ఆ వర్గం సైతం పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. కాకపోతే బాక్సాఫీస్ వద్ద ఉన్న మిగిలిన వాటితో ఉగ్రం చాలా బెటర్ పొజిషన్ లో ఉన్న మాట వాస్తవం. ఒకవేళ విరూపాక్ష లాగా కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే రెండో వారంలో అడుగుపెట్టేలోపు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఆరు కోట్ల షేర్ ఈజీగా వచ్చేసేది
ఎల్లుండి నాగ చైతన్య కస్టడీ రిలీజ్ కానుంది. దీని మీద మంచి బజ్ ఉంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అక్కినేని అభిమానులు దీని మీదే గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదీ పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే. కాకపోతే ఉగ్రం లాగా రివెంజ్ డ్రామా ఉండదు. పూర్తిగా కామెడీ జానర్ ని వదిలేసి సీరియస్ వైపు షిఫ్ట్ అయిపోయిన అల్లరి నరేష్ ఇకపై వీటికే కట్టుబడకుండా అన్ని రకాల పాత్రలను చేయాల్సిన అవసరాన్ని మొన్న ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం గుర్తు చేసింది. మరీ అంత బ్యాడ్ గా కాకపోయినా ఉగ్రం సైతం ఒకరకంగా అల్లరోడి మార్కెట్ పరిమితులను నిర్దేశించిందనే చెప్పాలి