టాలీవుడ్ యూత్ హీరోలకు స్పై ఫీవర్ పట్టుకుంది. కాకతాళీయంగా జరిగినా గూఢచారి కథలకు ఓటేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గూఢచారి 116తో దీన్ని మొదలుపెడితే తర్వాత సుమన్, చిరంజీవి, అర్జున్, కమల్ హాసన్ లాంటి ఎందరో స్టార్లు ఈ జానర్లో సూపర్ హిట్లు కొట్టారు. ఇదంతా జేమ్స్ బాండ్ స్ఫూర్తినే అయినప్పటికీ దర్శకులు ఆ కాన్సెప్ట్ ని ఇండియానైజ్ చేయడంతో విజయవంతమయ్యారు. అలియా భట్ రాజీ బ్లాక్ బస్టర్ అయ్యాక మళ్ళీ వీటి వాడకం బాలీవుడ్ లో ఊపందుకుంది. మొన్నటి మిషన్ మజ్ను దాకా చాలానే వచ్చాయి
తక్కువ బడ్జెట్ లో అడవి శేష్ గూఢచారి రూపంలో ఘనవిజయం అందుకున్నాక ఇతర దర్శక రచయితలకు ఊపొచ్చింది. అఖిల్ ని రెండేళ్ల పాటు కష్టపెట్టి సురేందర్ రెడ్డి తీసిన ఏజెంట్ ఎంత చేదు అనుభవం మిగిల్చిందో అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. తప్పు స్క్రిప్ట్ దనే విషయం నిర్మాతే ఒప్పేసుకున్నారు. త్వరలో నిఖిల్ స్పైగా రాబోతున్నాడు. సుభాష్ చంద్ర బోస్ అదృశ్యం వెనుక మిస్టరీని ఆధారంగా చేసుకుని గ్యారీ దీన్ని ప్యాన్ ఇండియా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రాబోయే గాండీవధారి అర్జునలో వరుణ్ తేజ్ కూడా రహస్య గూఢచారే
ఇప్పుడీ లిస్టులో విజయ్ దేవరకొండ చేరాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే భారీ చిత్రం స్పై బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని కాన్సెప్ట్ పోస్టర్ లో చెప్పేశారు. నమ్మకద్రోహానికి గురైన స్పై డ్రామాని చూపించబోతున్నారు. మొత్తానికి ఇందరేసి హీరోలు ఇలా ఒక క్యారెక్టర్ లో కనిపించడం ఈ మధ్య కాలంలో జరగలేదు.అడవి శేష్ కూడా కొన్ని నెలల క్రితమే గూఢచారి 2 మొదలుపెట్టాడు. బడ్జెట్ ఈసారి భారీగా పెంచేసి దర్శకుడిని మార్చారు. ఈ రెండేళ్ల పాటు దేశ విదేశాల్లో టాలీవుడ్ స్పైలు చేయబోయే సాహస విన్యాసాలు వరసగా చూస్తూనే ఉండాలి
This post was last modified on May 10, 2023 7:27 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…