మూడు రోజుల క్రితం ఖుషి అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరుకు ముందు ది(THE) అని పెట్టుకోవడం ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో సోషల్ మీడియా వేదిక చూశాం. ఎవరి గురించో నేరుగా చెప్పకుండా యాంకర్ కం యాక్టర్ అనసూయ ఈ పోకడ మీద వ్యంగ్యంగా ట్వీట్లు వేయడం రౌడీ హీరో ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యింది. అలా అని ఆవిడేం తగ్గలేదు. ఇదేనా అభిమానుల ప్రవర్తనంటూ స్క్రీన్ షాట్లతో పాటు మరిన్ని కౌంటర్లతో ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. హీరో వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఒకరకంగా మంచిదే అయ్యింది
కథ ఇక్కడితో అయిపోలేదు. విజయ్ దేవరకొండకు నేరుగా ఇన్ డైరెక్ట్ గా మద్దతు ఇచ్చే కౌంట్ పెరుగుతోంది. హరీష్ శంకర్ ట్విట్టర్ లో రౌడీ హీరో పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు పెట్టిన నాలుగు లైన్ల మెసేజ్ కు ప్రతి వాక్యానికి ముందు ది చేర్చారు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ మూడో లిరికల్ సాంగ్ విడుదల కాబోతున్న సందర్భంగా హీరో హీరోయిన్లు సంగీత దర్శకుడు ఇలా అందరి పేర్ల ముందు ‘ది’ని జోడించి పోస్టర్ వదిలారు. ఇక ఫ్యాన్స్ సంగతి సరేసరి. ఈ ట్యాగ్ ని వాడటం ఉద్యమంలా చేస్తున్నారు. క్రమంగా ఇదో వైరల్ పదంగా మారిపోతోంది
అనసూయ సైతం ఇందరు మద్దతుకు వస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిన్న మరో ట్వీట్ పెట్టడం గమనార్హం. అయినా అభ్యంతరం అనిపించినవాటికి స్పందిస్తే బాగుంటుంది కానీ ఇలా ది అనే ట్యాగ్ గురించి ఇంత సాగదీయాల్సిన అవసరం లేదని నెటిజెన్ల కామెంట్. ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో అనసూయ భర్తకు విజయ్ దేవరకొండకు వాగ్వాదం జరగడం వల్లే ఇలా బదులిస్తోందన్న వర్షన్ వినిపిస్తోంది కానీ నిజా నిజాలు ఆ ముగ్గురికే తెలియాలి. చూస్తుంటే ది అనేది విజయ్ దేవరకొండ శాశ్వత బిరుదుగా మారిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది
This post was last modified on May 9, 2023 3:08 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…