పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న వినోదయ సితం రీమేక్ కు ‘బ్రో’ టైటిల్ ఫిక్స్ చేశారనే లీక్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. సాధారణ జీవితంలో ఈ పదం వాడని వారు దాదాపుగా ఉండరు. స్నేహితులైనా జొమాటో డెలివరీ బాయ్ అయినా అందరికీ ఈ పిలుపు అలవాటే. కానీ అందరికీ నచ్చే వర్డ్ కాదు. బ్రదర్ ని షార్ట్ కట్ చేసి దారుణంగా మార్చారనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి బ్రోని పవర్ స్టార్ సినిమాకు పెడతారా అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికన్నా దేవరా వంద రెట్లు నయమని అభిప్రాయపడుతున్నారు
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నిజానికి దీనికి కాల భైరవ పేరుని పరిశీలించారట. అయితే అది లారెన్స్ రిజిస్టర్ చేయించుకుని పెట్టుకున్నారు. అడగాలని చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదని ఇన్ సైడ్ టాక్. దాంతో నెక్స్ట్ ఆప్షన్ గా పెట్టుకున్న బ్రో వైపే యూనిట్ మొగ్గు చూపారని వినికిడి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా లేకుండా ఇది జరిగి ఉంటుందని అనుకోలేం. అందుకే పవన్ అభిమానులు ఆయన మీదా గుస్సా చూపిస్తున్నారు. ఏమైనా అనూహ్య మార్పులు ఉంటే తప్ప ఈ బ్రో దాదాపు ఖాయమే
ఓజి రెండు అక్షరాలు ఇప్పుడీ బ్రో ఒక్క అక్షరం మొత్తానికి వెరైటీగానే ఆలోచిస్తున్నారు పవన్ దర్శకులు. హీరోకు సంబంధించిన పార్ట్ ని ఎప్పుడో పూర్తి చేసిన సముతిరఖని బ్యాలన్స్ పార్ట్ ని ఈ నెలలోనే ఫినిష్ చేయబోతున్నారు. జూన్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు. హీరోయిన్ లేకుండా పవన్ నటించిన మొదటి సినిమా ఇదే. కమర్షియల్ సాంగ్స్ లేకపోయినా ఎంటర్ టైన్మెంట్, ఫైట్లకు ఢోకా లేకుండా చాలా మార్పులు చేశారట. తక్కువ బడ్జెట్ ఎక్కువ రిటర్న్స్ ని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సినిమా చివరికి బ్రోకే ఫిక్స్ అవుతుందేమో
This post was last modified on May 9, 2023 12:45 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…