చిరు బర్త్ డే కి అన్నీ తేల్చేస్తారు!

మెగాస్టార్ బర్త్ డే కి ఈసారి అభిమానులకు చాలా కానుకలు ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఆరోజే విడుదల చేస్తారు. అలాగే లూసిఫర్ రీమేక్ పై నెలకొన్న సస్పెన్స్ కి కూడా అదే రోజు తెర దించేస్తారు. ఈ చిత్రం నుంచి సాహూ దర్శకుడు సుజీత్ తప్పుకోవడంతో వినాయక్ దర్శకత్వ బాధ్యతలు చేపడతాడని ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ సినిమా గురించిన వదంతుల గురించి ‘చిట్టిబాబు’ ఫోటో పెట్టి ‘కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వింటున్నా’ అంటూ రామ్ చరణ్ సెటైర్ వేసాడు. ఇదిలా వుంటే చిరు పుట్టినరోజుకి లూసిఫర్ దర్శకుడు ఎవరనేది అనౌన్స్ చేస్తారట.

అలాగే ఈ సినిమా టైటిల్ ఏమిటనేది కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆచార్య షూటింగ్ డిసెంబర్ లో పునఃప్రారంభం అవుతుందని, వచ్చే వేసవికి విడుదల చేసేలా షెడ్యూల్ చేస్తున్నారని సమాచారం.