Rajini Kanth
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఒక టైంలో రాజకీయాల వైపు మనసు మళ్లి సినిమాల మీద ఫోకస్ తగ్గించేశాడు. దీనికి తోడు చాలా ఏళ్ల పాటు సరైన హిట్ లేకపోవడం కూడా ఆయన పట్ల ఆసక్తిని తగ్గించేసింది. కానీ తన ఆరోగ్య పరిస్థితులు, కొవిడ్ దృష్ట్యా రాజకీయాలకు శాశ్వత సెలవు ప్రకటించేసి సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు రజినీ.
ఆయన చివరి సినిమా ‘అన్నాత్తె’ కూడా నిరాశ పరిచినప్పటికీ.. కొత్త చిత్రం ‘జైలర్’ మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు ఆయన చేయబోయే కొత్త సినిమాల లైనప్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ‘లాల్ సలామ్’ అనే స్పెషల్ మూవీ కూడా ఉంది.
ఇది రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రిమది. ఇంతకుముందు దర్శకురాలిగా 3, వై రాజా వై అనే రెండు చిత్రాలతో ఐశ్వర్య తన ప్రతిభను చాటింది. ‘3’ సినిమా ఫ్లాప్ అయినా అందులో ఆమె దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ‘వై రాజా వై’ మంచి హిట్ అయింది కూడా.
రెండో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘లాల్ సలామ్’ను రూపొందిస్తున్న ఐశ్వర్య.. ఇందులో తన తండ్రి కోసం ఒక ప్రత్యేక అతిథి పాత్రను క్రియేట్ చేసింది. ఆయన పాత్ర పేరు, ఫస్ట్ లుక్‌ను తాజాగా రివీల్ చేశారు. ఇందులో మొయిదీన్ బాయ్ అనే ముస్లిం పాత్ర చేస్తున్నాడు రజినీ.
సంప్రదాయ ముస్లిం గెటప్‌లో ఆయన ఫస్ట్ లుక్ అందరిలోనూ క్యూరియాసిటీ పెంచుతోంది. రజినీని ఇలాంటి లుక్‌లో చూడటం అభిమానులకు పెద్ద సర్ప్రైజే. మొయిదీన్ భాయ్ అనగానే.. రజినీ మూడు దశాబ్దాల కిందట ‘బాషా’ చిత్రంలో బాషా భాయ్ గుర్తుకు వస్తున్నాడు ఫ్యాన్స్‌కు. రజినీ అనగానే ఊర మాస్ అవతారంలో ఊహించుకుంటారు కానీ.. ఇందులో ఆయన అలాంటి పాత్ర చేస్తున్నట్లుగా కనిపించడం లేదు.
ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. టైటిల్, ఇతర విషయాలు చూస్తుంటే ఇదొక దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమాలా కనిపిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘లాల్ సలామ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on May 8, 2023 1:14 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…