Movie News

సరైన జానర్ పట్టుకున్న సందీప్ కిషన్

హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ కు ఆ మధ్య మైఖేల్ పెద్ద షాకే ఇచ్చింది. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనుకుంటే దర్శకుడు గ్యాంగ్ స్టర్ క్లాసిక్స్ ని అతి స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకుంది. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ ఊరి పేరు భైరవకోన మీదే పెట్టుకున్నాడు. తనకు గతంలో టైగర్ రూపంలో పెద్ద సక్సెస్ ఇచ్చిన విఐ ఆనంద్ తో చేతులు కలిపాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి డిఫరెంట్ మూవీస్ తో మెప్పించిన ఆనంద్ ఒక్క క్షణం, డిస్కో రాజా ఫలితాలు నిరాశపరిచాక కొంత గ్యాప్ తీసుకున్నారు

టీజర్ కట్ చూస్తే ఆసక్తికరంగా ఉంది. గరుడపురాణంలోని మాయమైన నాలుగు పేజీల ఆధారంగా భైరవకోన అనే ఊరిలో తలెత్తిన విపరీత పరిణామాలు నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్టుగా చూపించారు. లోపలి వెళ్లడమే కానీ బయటికి రావడం ఉండని ఆ ప్రమాదకరమైన చోటు వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనే పాయింట్ మీద నడిచింది. అయితే ఇటీవలే వచ్చిన విరూపాక్ష పోలికలు ఈ భైరవకోనలో కనిపిస్తున్నాయి. హారర్ ఎలిమెంట్స్ ఇందులోనూ పొందుపరిచారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ అంశం, హత్యలు గట్రా సారూప్యంగానే ఉన్నాయి

ఇప్పుడెలాగూ ఈ సీజన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది కాబట్టి కంటెంట్ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయితే మాత్రం సందీప్ కిషన్ కు బ్రేక్ దొరికినట్టే. ఏజెంట్ తో ఇటీవలే గట్టి దెబ్బ తిన్న అనిల్ సుంకర దీనికి సమర్పకులు కావడం గమనార్హం. రెగ్యులర్ కథలు లవ్ స్టోరీలతో వర్కౌట్ కావడం లేదని గుర్తించిన యూత్ హీరోలు ఇలా వినూత్నంగా ట్రై చేయడం మంచిదే. కాకపోతే తక్కువ గ్యాప్ లో ఒకే క్యాటగిరీ సినిమాలు వచ్చినప్పుడు ఇబ్బంధి రావొచ్చు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఫాంటసీ ఈ థ్రిల్లర్ కి శేఖర్ చంద్ర సంగీతం, రాజ్ తోట ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు

This post was last modified on May 8, 2023 7:05 am

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

53 minutes ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

2 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

3 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

5 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

7 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

8 hours ago