సినీ ప్రియుల కోసం శుక్రవారం మళ్లీ కొత్త సినిమాలను మోసుకొచ్చేసింది. ఈసారి రెండు క్రేజీ చిత్రాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఒకటి ‘రామబాణం’ కాగా.. ఇంకోటి ‘ఉగ్రం’. ఈ రెండు చిత్రాలకూ ఒక విషయంలో సారూప్యత ఉంది. వీటిని రూపొందించిన దర్శకులు, అందులో నటించిన హీరోలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్.
ఇంతకుముందు మంచి విజయాలందుకున్న జోడీలు.. మరోసారి బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాయి. గోపీచంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన లక్ష్యం, లౌక్యం సినిమాలను రూపొందించిన శ్రీవాస్.. చాలా గ్యాప్ తర్వాత అతడితో జట్టు కట్టాడు. వీరి కలయికలో హ్యాట్రిక్ సినిమా అవుతుందని ‘రామబాణం’ మీద ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ‘లౌక్యం’ చేసే సమయానికి.. ఇప్పటికి వీళ్లిద్దరి జాతకాలు మారిపోయాయి. గోపీచంద్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. అతడి చివరి సినిమా ‘పక్కా కమర్షియల్’ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
శ్రీవాస్ ట్రాక్ రికార్డు కూడా బాగా లేదు. డిక్టేటర్, సాక్ష్యం సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. కాంబినేషన్ క్రేజీగానే ఉన్నా ‘రామబాణం’ ట్రైలర్ చూస్తే మరీ అంచనాలు పెట్టుకోదగ్గ సినిమాలా కనిపించలేదు. మరి తమ కెరీర్లకు ఎంతో కీలకమైన సినిమాతో గోపీ, శ్రీవాస్ హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నది చూడాలి. ఇక ‘ఉగ్రం’ విషయానికి వస్తే.. ‘నాంది’ లాంటి మంచి, హిట్ సినిమా తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కలిసి చేసిన సినిమా ఇది.
తొలి చిత్రం లాగే ఈసారి కూడా సామాజిక అంశాలకు పెద్ద పీట వేస్తూ సీరియస్ సినిమా చేశారు. ఒకప్పడు కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నరేష్.. ఈ సినిమా కోసం చాలా సీరియస్‌గా, వయొలెంట్‌గా ఉండే పాత్ర చేయడం విశేషమే. తొలి సినిమాతో ప్రతిభ చాటిన విజయ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. మరి విజయ్, నరేష్ కలిసి ద్వితీయ విఘ్నాన్ని దాటి మరో సక్సెస్ అందుకుంటారా అన్నది చూడాలి.
This post was last modified on May 5, 2023 11:06 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…