Movie News

శ‌క్తి సినిమా న‌ష్టం అంతా?

శ‌క్తి.. ఈ పేరెత్తితే జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక గ‌గుర్పాటు క‌లుగుతుంది. ఆ స‌మ‌యానికి తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమాల్లో అది ఒక‌టి. అంచ‌నాలు కూడా అందుకు త‌గ్గ‌ట్లే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ అభిమానులు పెట్టుకున్న న‌మ్మ‌కాల‌ను కూల్చేస్తూ.. నిర్మాత అశ్వినీద‌త్‌ను ముంచేస్తూ దారుణ‌మైన డిజాస్ట‌ర్ అందించాడు మెహ‌ర్ ర‌మేష్‌.

పుష్క‌ర కాలం దాటినా శ‌క్తి సినిమా ఏదో ర‌కంగా ఎన్టీఆర్ అభిమానుల‌ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక నిర్మాత అశ్వినీద‌త్ అయితే ఆ సినిమా పేరు తలుచుకుంటే ఒక ర‌క‌మైన నిరాశావాదంలోకి వెళ్లిపోతారు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి శ‌క్తి సినిమా తాలూకు చేదు జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు ద‌త్. ఈ సినిమా త‌న‌కు ఏకంగా రూ.32 కోట్ల న‌ష్టం మిగిల్చిన‌ట్లు ద‌త్ వెల్ల‌డించారు.

ప‌న్నెండేళ్ల కింద‌ట ఇంత న‌ష్టం అంటే మామూలు విష‌యం కాదు. అంత న‌ష్టం త‌ర్వాత సినిమాలు తీయ‌డం అంటే గొప్ప విష‌య‌మే. కానీ ఆ స‌మ‌యంలో కొన్నేళ్ల పాటు త‌న‌కు సినిమాల మీదే విర‌క్తి క‌లిగిన‌ట్లు ద‌త్ వెల్ల‌డించారు. శ‌క్తి సినిమా నాకు ఆ రోజుల్లోనే 32 కోట్ల న‌ష్టం మిగిల్చింది. ఇంత న‌ష్టం అంటే త‌ట్టుకోవ‌డం క‌ష్టం. ఇక సినిమాలే ఆపేద్దాం అన్న ఆలోచ‌న వ‌చ్చింది. నాలుగైదేళ్లు సినిమాలు తీయ‌లేదు. అస‌లు సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న కూడా రాలేదు అని ద‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

శ‌క్తి సినిమా త‌ర్వాత ద‌త్ మాత్ర‌మే కాక‌.. ఆయ‌న కూతుళ్లు కూడా నాలుగేళ్ల పాటు సినిమాలు తీయ‌లేదు. త‌ర్వాత ప్రియాంక‌, స్వ‌ప్న క‌లిసి ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంతో ప్రొడ‌క్ష‌న్లోకి దిగారు. ఆపై మ‌హాన‌టి మూవీతో ద‌త్ సైతం రీఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత వైజ‌యంతీ వారి ప్ర‌యాణం బాగానే సాగుతోంది. ప్ర‌స్తుతం ప్రాజెక్ట్-కే లాంటి మెగా మూవీని నిర్మిస్తున్నారు ద‌త్.

This post was last modified on May 5, 2023 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

1 hour ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

2 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

2 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

4 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

5 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

6 hours ago