సూర్య, అమీర్ ఖాన్ల కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ క్లాసిక్ గజిని. దర్శకుడు మురుగదాస్ ని ఒక్క దెబ్బకు స్టార్ డైరెక్టర్ చేసిన ఘనత దీనిది. సీక్వెల్ కావాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కథ కుదరక వాయిదా పడుతూ వస్తోంది. దానికి తోడు అప్పడు మంచి ఫామ్ లో ఉన్న మురుగదాస్ గత కొంత కాలంగా పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యేలా ఫ్లాప్స్ ఇచ్చారు. రజనీకాంత్ పిలిచి మరీ దర్బార్ ఇస్తే అదీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. గజిని హిందీ వెర్షన్ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పుడు కొనసాగింపు గురించి సీరియస్ ప్లాన్లో ఉన్నట్టు ముంబై అప్డేట్
దీనికి సహేతుకమైన కారణం ఉంది. అమీర్ గత అయిదారు నెలల్లో అరవింద్ తో పలు దఫాలు చర్చల్లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్స్ అన్నీ ప్రైవేట్ గా జరిగాయి. మీడియాకు సమాచారం ఇవ్వడం లాంటివి చేయలేదు. లాల్ సింగ్ చద్దాకు ముందు మరో ఫారిన్ రీమేక్ ఫిక్స్ అయిన అమీర్ ఆ తర్వాత ఆ ప్రతిపాదన మానుకుని తన నిర్మాణంలోనే వేరే హీరోతో తీయాలని నిర్ణయించుకున్నారు. కానీ గజిని 2 మీద మాత్రం ముందు నుంచి మనసు ఉంది. అయితే ప్రస్తుతం సూర్యకు ఈ ప్రాజెక్ట్ మీద అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఉంటే దాస్ ని ఎప్పుడో ఒత్తిడి చేసేవాడు
సూర్య చేసినా చేయకపోయినా అమీర్ గజినీ 2 గా రావడం దాదాపు ఖాయమే. 2008లో తన ప్రతీకారం తీర్చుకున్న సంజయ్ సింఘానియా ఇప్పుడు ఏం చేస్తుంటాడనే కాన్సెప్ట్ తో మంచి డ్రామాను అల్లుకోవచ్చు. అప్పుడు నటించిన క్యాస్టింగ్ తో పాటు ఏఆర్ రహమాన్ దాకా అందరూ అందుబాటులో ఉన్నారు. బలమైన కంబ్యాక్ దక్కాలంటే మాత్రం అమీర్ కొంత కాలం ప్రయోగాలు పక్కనపెట్టి రెగ్యులర్ యాక్షన్ మోడ్ లోకి రావాల్సిందే. గజినినే బెస్ట్ ఆప్షన్. వసూళ్ల పరంగా అప్పట్లో కురిసిన కనకవర్షం అరవింద్ అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే మళ్ళీ ఆ మేజిక్ కావాలట