మరో శుక్రవారం బాక్సాఫీస్ యుద్ధానికి తెరలేచింది. అయితే ఈసారి భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియాలు, యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టిన స్టార్ హీరోలు లేకుండా మీడియం రేంజ్ మూవీస్ తలపడుతున్నాయి. రామబాణం మీద గోపిచంద్ చాలా నమ్మకం చూపిస్తున్నాడు. కొత్త కథేమీ కాదని చెబుతూనే కమర్షియల్ జానర్ లో కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉంటాయని చెబుతున్నాడు. దర్శకుడు శ్రీవాస్ ప్రయోగాల జోలికి వెళ్లకుండా రెగ్యులర్ టెంప్లేట్ ని నమ్ముకుని మాస్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి
అల్లరి నరేష్ ఈసారి పూర్తి సీరియస్ టర్నింగ్ తీసుకుని ఉగ్రంతో థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. నాంది రూపంలో తనకో మంచి బ్రేక్ ఇచ్చిన విజయ్ కనకమేడలకు రెండో ఛాన్స్ ఇచ్చాడు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలోని మూడు దశలను సోషల్ ఇష్యూతో ముడిపెట్టి ఆసక్తి రేపే స్క్రీన్ ప్లే ఆధారంగా నడిపించారని ఇన్ సైడ్ న్యూస్. దీనికి టాక్ చాలా కీలకం. కామెడీ జానర్ ని పూర్తిగా వదిలేసిన నరేష్ ఇకపై ఇంటెన్స్ డ్రామాలే ఎక్కువ చేస్తానంటున్నాడు. ఇప్పుడీ ఉగ్రం కనక మంచి సక్సెస్ అయితే తన స్టేట్ మెంట్ కి మరింత బలం చేకూరుతుంది.
బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయింది. ఏజెంట్ మొదటి వారం పూర్తి కావడం ఆలస్యం దాదాపు మాయం కావడం లాంఛనమే. పొన్నియిన్ సెల్వన్ 2 అతి కష్టం మీద ఈదుతోంది. విరూపాక్ష కలెక్షన్లు డీసెంట్ గా ఉన్నా మూడు వారాలు దాటిపోవడంతో ఎక్కువ ఆశించడానికి లేదు. సో రామబాణం, ఉగ్రంలకు మంచి ఛాన్స్ ఉంది. వివాదాలను కేంద్ర బిందువుగా చేసుకున్న ది కేరళ స్టోరీ, హాలీవుడ్ మూవీ గార్డియన్స్ అఫ్ గాలక్సీ వాల్యూమ్ 3లకు అంత బజ్ లేదు. హాళ్లకు జనాలు బాగా తగ్గిపోయిన తరుణంలో మాసోడు, అల్లరోడు పబ్లిక్ ఎలా ఆకట్టుకుంటారో ఇంకో 24 గంటల్లో తేలిపోతుంది
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…