వరస డిజాస్టర్లతో బాగా డౌన్ లో ఉన్న అక్కినేని అభిమానులకు ఇప్పుడున్న ఒకే ఒక్క ఆశ కస్టడీ. ఏజెంట్ దారుణంగా డిజాస్టర్ కావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాత అనిల్ సుంకర నాలుగో రోజే ఫలితం గురించి ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం చూస్తే ఏ స్థాయిలో తిరస్కారానికి గురయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ బరువంతా నాగ చైతన్య మీద పడింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు గత కొంత కాలంగా తాము వరస పరాజయాలతో ఉన్న మాట వాస్తవమేనని ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే కనక బెస్ట్ ఇచ్చే దిశగా కష్టపడతామని హామీ ఇచ్చాడు .
కస్టడీ విషయంలో పూర్తి నమ్మకంతో సినిమా చూడొచ్చని కాన్ఫిడెన్స్ నింపాడు. ఒక డిఫరెంట్ పాయింట్ తో దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారని సక్సెస్ అవుతుందని నొక్కి వక్కాణించాడు. అభిమానులకు కావాల్సింది ఈ ఊరటే. అఖిల్ దుబాయ్ వెళ్ళిపోయాడు. నాగార్జున అందుబాటులో లేరు. అందుకే వాళ్ళ చూపంతా చైతు మీదే ఉంది. అసంతృప్తిని ఇంకా చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో వెయ్యికి పైగా ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా ఫోటో షూట్ ప్లస్ మీటింగ్ చేయబోతున్నాడు. గంటల తరబడి సాగే ఈ ప్రోగ్రాం ప్లానింగ్ జరుగుతోంది
ఎలాగూ అక్కినేని ఫ్యామిలీ తర్వాత సినిమాలు వచ్చేందుకు బాగా టైం పడుతుంది. నాగ్ బెజవాడ ప్రసన్నకుమార్ ల షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. యువి బ్యానర్ లో అఖిల్ చేయబోయే మూవీ తాలూకు అనౌన్స్ మెంట్ వస్తే కానీ నిర్ధారణగా చెప్పలేం. సుశాంత్, సుమంత్ లు సపోర్టింగ్ రోల్స్ కి మారిపోయారు. సో కస్టడీ కనక బ్లాక్ బస్టర్ కొడితే ఆ ఆనందం ముందు ఈ గ్యాప్ లన్నీ మర్చిపోవచ్చు. హీరోయిన్ కృతి శెట్టి, విలన్ అరవింద్ స్వామి, డైరెక్టర్ వెంకట్ ప్రభు, సంగీత దర్శకులు ఇళయరాజా-యువన్ శంకర్ రాజా ఇలా అందరికీ కస్టడీ విజయం సాధించడం చాలా కీలకం
This post was last modified on May 4, 2023 11:46 am
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…