Movie News

జంట నిర్మాతలుగా సమంతా అనుష్క

హీరోలు ప్రొడ్యూసర్లుగా మారడం ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ హీరోయిన్లు రిస్క్ తీసుకోవడం తక్కువ. ఒక్కసారి చేయి కాలితే వచ్చే నష్టం భరించడం అంత సులభం కాదు కాబట్టి ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. కాజల్ అగర్వాల్ ఇలాగే నిర్మాణంలో దిగి ఓ మీడియం బడ్జెట్ సినిమా తీస్తే నెలలు గడుస్తున్నా అది రిలీజ్ కాలేకపోయింది. కానీ సమంతా అలా జరక్కుండా పక్కా ప్లానింగ్ తో బాలీవుడ్ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి త్వరలోనే ఒక జాయింట్ వెంచర్ ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించిన పలు దఫాల చర్చలు ఇద్దరి మధ్య ముంబైలో జరిగాయి.

ఇందులో సామ్ ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఫిమేల్ సెంట్రిక్ గా రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ ని ప్యాన్ ఇండియా మూవీగా మలచాలా లేక వెబ్ సిరీస్ గా చేయాలానే నిర్ణయం ఇంకా తీసుకోలేదని టాక్. అనుష్క తమ్ముడు కర్నేష్ శర్మని దర్శకుడిగా దీని ద్వారానే లాంచ్ చేయాలనేది మరో ప్లాన్. మిగిలిన క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ డీటెయిల్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇద్దరూ కలిసి సుమారు పాతిక కోట్లకు పైగానే బడ్జెట్ ని దీని కోసం సిద్ధం చేయబోతున్నారట. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతాకు వచ్చిన గుర్తింపు మీదనే బిజినెస్ చేయబోతున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సిటాడెల్ రీమేక్ మీద సామ్ బోలెడు నమ్మకం పెట్టుకుంది.రాజ్ అండ్ డీకే దర్శకులు కావడంతో ఇంకో బ్రేక్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అయితే ఇదే పాత్రని ప్రియాంకా చోప్రా చేసిన ఒరిజినల్ వెర్షన్ తొలి రెండు ఎపిసోడ్లకు అమెజాన్ ప్రైమ్ లో ఆశించిన స్పందన రాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. శాకుంతలం గట్టి దెబ్బ కొట్టడంతో ఆ షాక్ నుంచి బయట పడాలంటే సిటాడెల్ సక్సెస్ కావడం చాలా కీలకం. ఈ మధ్య యాక్టివ్ గా ఉండటం బాగా తగ్గించేసిన అనుష్క శర్మ కూడా ఇకపై నటిగా నిర్మాతగా బాగా బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.

This post was last modified on May 4, 2023 12:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

3 minutes ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

23 minutes ago

ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…

23 minutes ago

ఆగని పూజా ఫ్లాప్ స్ట్రీక్…

అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…

1 hour ago

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…

2 hours ago

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

3 hours ago