Movie News

నరేష్ పెళ్లి మీద అంత నమ్మకం ఏంటో

నిజ జీవిత అనధికార జంటగా చెలామణి అవుతున్న నరేష్ పవిత్ర హీరో హీరోయిన్లుగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న మళ్ళీ పెళ్లి ఈ నెల 26 విడుదల కాబోతోంది. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఆ డేట్ అంత రిస్క్ లేనిదైతే కాదు. ఎందుకంటే అదే రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ తర్వాత ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అనుష్క ఫ్యాన్స్ ఎలాగూ ఫస్ట్ డే చూసేస్తారు. జాతిరత్నాలుతో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి అంతకన్నా ఎక్కువే లాగుతాడు.

సో మళ్ళీ పెళ్లికి మొదటి థ్రెట్ ఇదే అవుతుంది. కమెడియన్లు హీరోలుగా నటించిన సినిమాలు ఆడిన దాఖలాలున్నాయి కానీ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు మెయిన్ లీడ్ గా చేసి సక్సెస్ అయిన చిత్రాలు పెద్దగా కనిపించవు. కానీ దీనికి మాత్రం ఓటిటి డీల్స్ తో కలిపి తనే నిర్మాతైన నరేష్ కు టేబుల్ ప్రాఫిట్స్ తెస్తోందని ఇన్ సైడ్ టాక్. బాగా వివాదాల్లో నలిగిన జంట కావడం, రియల్ లైఫ్ జరిగిన సంఘటనలనే తెరమీద పాత్రల రూపంలో చూపించడంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు

ఇక్కడితో కథ అయిపోలేదు. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన రుద్రాంగి, సిద్దార్థ్ టక్కర్, మూడు హిందీ నాలుగు హాలీవుడ్ సినిమాలు మే 26నే విడుదల కాబోతున్నాయి. అయిదు రోజులు తిరక్కుండానే సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మోసగాళ్లకు మోసగాడు ఫోర్ కెలో 31న రాబోతోంది. ఇంత కాంపిటీషన్ పెట్టుకుని మళ్ళీ పెళ్లిని బరిలో దింపడం సాహసమే. ఏమో గుర్రం ఎగరావచ్చు సామెత తరహాలో ఇదే ఊహించినని షాక్ ఇస్తుందేమో. ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలిగి దర్శకుడిగా గత రెండేళ్లుగా బి గ్రేడ్ కంటెంట్ తీస్తున్న ఎంఎస్ రాజు దీంతో ఏమైనా రూటు మార్చారేమో చూడాలి.

This post was last modified on May 3, 2023 11:57 pm

Share
Show comments

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

5 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago