ఒక సినిమా హిట్టయితే హీరోల సంతోషమే వేరు. అదే ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ అయితే మాత్రం ఏ హీరో అయినా ఆ రిజల్ట్ ను మర్చిపోయి కొలుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. తాజాగా అఖిల్ కి ఇదే పరిస్థితి ఎదురైంది. రెండేళ్ళు కష్టపడి చేసిన ‘ఏజెంట్’ డిజాస్టర్ అనిపించుకుంది. స్పై యాక్షన్ మూవీగా వచ్చిన ఏజెంట్ తో అఖిల్ మూవీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరిచాడు. దీంతో సినిమా మ్యాట్నీ నుండే చతికల పడింది.
మొదటి రోజు వచ్చిన రిజల్ట్ తో ఏజెంట్ ట్రోలర్స్ కి ఫుల్లు గా దొరికేసింది. ఎలాంటి లాజిక్స్ లేకుండా ఈ స్పై మూవీ ను తీసిన సురేందర్ రెడ్డి ను ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అక్కినేని ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అఖిల్ కి సపోర్ట్ గా అమల రంగంలో దిగి ట్రోల్ చేయాల్సిన సినిమా కాదని చెప్పాల్సి వచ్చింది. ఇదంతా అఖిల్ ను బాగా డిస్టర్బ్ చేసింది.
అఖిల్ కి ఫెయిల్యూర్ అనేది కొత్త కాదు. ఇప్పటి వరకూ అక్కినేని యంగ్ హీరోకి సరైన హిట్ లేదు. కానీ ఏజెంట్ విషయం వేరు. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు అఖిల్. కండలు పెంచి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ పడుతుందని గట్టిగా నమ్మాడు. కానీ ఏజెంట్ అఖిల్ ఆశలపై నీళ్ళు చల్లింది. దీంతో ఏజెంట్ డిజాస్టర్ నుండి త్వరగా బయటికొచ్చేందుకు దుబాయి వెళ్ళిపోయాడు. అక్కడే కొన్ని రోజుల పాటు గడిపి తర్వాత ఇండియా రానున్నాడు. వచ్చాక అఖిల్ నెక్స్ట్ సినిమాకు సంబందించి ప్రకటన ఉంటుంది. యూవీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా ఉండబోతుంది.
This post was last modified on May 2, 2023 10:51 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…