విడుదలైన రెండు మూడు రోజులు తిరక్కుండానే విపరీతమైన చర్చలకు దారి తీసిన ఏజెంట్ ఫలితం నిర్మాత అనిల్ సుంకర స్టేట్ మెంట్ తో కొత్త మలుపు తిరగడం ఆ తర్వాత పరిణామాలు చూస్తూనే ఉన్నాం. అఖిల్ చల్లగా దుబాయ్ వెళ్ళిపోయాడు. ఎంత డిజాస్టర్ అయినా కనీసం ఫస్ట్ వీక్ ఫుల్ కోసం చేసే ప్రమోషన్లు కూడా దీనికి చేయలేదు. అభిమానుల విమర్శలతో ట్విట్టర్ వేదికగా దర్శకుడు సురేందర్ రెడ్డి తడిసి ముద్దవుతున్నారు. హీరోయిన్ సాక్షి వైద్య, విలన్ డినో మోరియా, ప్రధాన పాత్ర పోషించిన మమ్ముట్టి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. మొత్తం వాష్ ఔటే.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏజెంట్ ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోతోంది. మే 19న సోనీ లివ్ లో తెలుగు తమిళ మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ డేట్ అయితే లాక్ చేశారు. ఏ క్షణమైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు. భారీ రేటుకి హక్కులను సొంతం చేసుకున్న సోనీ నిజానికి దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది. ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటివి పోటీ పడినా సరే ఏదోలా చేజిక్కించుకుంది. అయితే థియేటర్లలో ఏజెంట్ చూసినవాళ్లు తక్కువ కాబట్టి వ్యూస్ పరంగా నమ్మకం పెట్టుకోవచ్చు.
సరిగ్గా ఇరవై రోజులకే అఖిల్ డిజిటల్ స్క్రీన్ మీదకు వచ్చేస్తున్నాడు. గత ఏడాది సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలన్న నిబంధన ఎవరూ పాటించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే రావణాసుర ఇప్పుడు ఏజెంట్ అదే దారి పడుతున్నాయి. ఇకపై ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఓటిటి కండీషన్ గురించి మాత్రం ఎవరూ నోరు విప్పేలా లేరు. అయినా విపరీత నష్టాల నుంచి అంతో ఇంతో బయటపడేస్తోంది ఈ డిజిటల్ డీల్సే. సో ఆపడం అడ్డుకోవడం భవిష్యత్తులో జరగని పని.
This post was last modified on May 2, 2023 10:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…