అనుభవం ఉన్న దర్శకులపై అల్లు అర్జున్ కి ఉన్నంత భరోసా మరెవరికీ ఉండదని చెప్పొచ్చు. తన కెరీర్ ని మలుపు తిప్పింది కొత్త దర్శకుడు సుకుమార్ అయినా కానీ ఆ తర్వాత మాత్రం బన్నీఅనుభవానికే పట్టం కట్టాడు. టాప్ లీగ్ లో ఉన్న దర్శకులతో తప్పకుండా సినిమా చేయాలని అల్లు అర్జున్ తన వైపు నుంచే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఎన్నిసార్లు కాంబినేషన్ సెట్ కాకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ఆ దర్శకులను కాంటాక్ట్ చేస్తూనే ఉంటాడు.
అలానే కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేయించాడు. ఇక అల్లు అర్జున్ కి మిగిలిపోయిన కల రాజమౌళి దర్శకత్వంలో నటించాలని. ఏ హీరోని అయినా ఇంకో లెవల్ కి తీసుకెళ్లేది రాజమౌళి సినిమానే కనుక అతడితో సినిమా చేసి తీరాలని బన్నీ ఎదురు చూస్తున్నాడు. రాజమౌళికి మహేష్ తో కమిట్మెంట్ తప్ప ఇక వేరే హీరోలతో ఏమీ ముందస్తు ఒప్పందాలు లేవు. తన తోటి హీరోలు అందరితో చేసిన రాజమౌళి తనతో మాత్రమే ఇంకా సినిమా చేయలేదు. కనుక మహేష్ సినిమా తర్వాత తనతో అల్లు అర్జున్ భావిస్తున్నాడు.
ఈలోగా రాజమౌళి సినిమాకు అవసరమైన పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకోవడం కోసం కృషి చేస్తున్నాడు. అందుకే తన సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ చేయబోతున్నాడు. మహేష్ తో సినిమా పూర్తి చేయడానికి ఇప్పట్నించీ రాజమౌళి కనీసం మూడేళ్లు పడుతుంది కనుక ఈలోగా అల్లు అర్జున్ వి రెండు, మూడు సినిమాలొచ్చేస్తాయి.
This post was last modified on August 5, 2020 4:11 pm
రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిధుల సమీకరణకు కూడా..…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలు చూస్తే.. తన కడుపు…
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…