Movie News

ఆ హీరోయిన్ మూడో భర్త చనిపోయాడు

వనిత విజయ్ కుమార్.. సినిమాలు, సినీ రంగానికి సంబంధించిన విషయాలను ఫాలో అయ్యే వారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తమిళ సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజులల తనయురాలైన ఈ అమ్మాయి ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది.

తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి కూడా పెద్ద వివాదానికే దారి తీసింది. ఇంత గొడవ తర్వాత చివరికి పీటర్‌తోనూ ఆమె ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఏడాది తిరిగేసరికి పీటర్ నుంచి విడిపోయింది వనిత. అప్పట్నుంచి వార్తల్లో లేని పీటర్ పేరు.. ఇప్పుడు మరణ వార్తతో మీడియాలోకి వచ్చింది.

తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పీటర్ పాల్ చనిపోయాడు. పీటర్ వయసు 39 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. తాగుడుకు బానిస కావడం వల్లే పీటర్ చనిపోయాడని అంటున్నారు. వనితతో పెళ్లి తర్వాత ఇద్దరికీ ఈ విషయంలోనే గొడవలు తలెత్తాయి. రోజూ తాగకుండా ఉండలేని బలహీనతతో పీటర్ పూర్తిగా దారి తప్పాడని.. తాగి తనను కొట్టేవాడని ఆమె మీడియా ముందు చెప్పింది. తాగుడు వల్ల కాలేయం దెబ్బ తిని ఆసుపత్రి పాలయ్యాడట పీటర్. కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్న అతను.. తాజాగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సందర్భంగా వనిత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. పీటర్ తాగుడు గురించి పరోక్షంగా ఆమె అందులో పరోక్షంగా ప్రస్తావించింది కూడా. ఇప్పుడు వెళ్తున్న కొత్త చోట అయినా ప్రశాంతంగా బతకాలని పేర్కొంటూ నువ్వుకెక్కడున్నా నీ మంచినే కోరుకుంటా అని వనిత పేర్కొంది. తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

This post was last modified on May 1, 2023 1:31 pm

Share

Recent Posts

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

13 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

6 hours ago