సాయి తేజ్ ధరమ్ కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్న విరూపాక్ష నిన్న మొన్న వీకెండ్ ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కొత్త రిలీజులు ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 కంటే దీనికే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. చాలా చోట్ల అఖిల్ సినిమాని తీసేసి అప్పటికప్పుడు విరూపాక్ష వేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల దాదాపు హౌస్ ఫుల్స్ పడిపోవడం ఈ హారర్ మూవీ జనంలోకి ఎంతగా రీచ్ అయ్యిందో తేటతెల్లం చేస్తోంది. రామబాణం, ఉగ్రంలు వచ్చేదాకా తేజుకు బ్రేకులు వేయడం కష్టం కాదు అసాధ్యం.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు విరూపాక్ష పది రోజులకుగాను 53 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. షేర్ లెక్కలో 30 కోట్ల 35 లక్షల దాకా తేలుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ మసాలాలు లేని ఒక చిత్రానికి ఇంత మొత్తం రావడమంటే అదో అద్భుతమే. మీడియం బడ్జెట్ సినిమాల్లో పదో రోజు అత్యధికంగా కలెక్ట్ చేసిన వాటిలో ఉప్పెన 2 కోట్ల 60 లక్షలలో మొదటి స్థానంలో ఉండగా విరూపాక్ష 2 కోట్ల 40 లక్షలతో సెకండ్ ప్లేస్ తీసుకుంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచులు, తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న భారీ వర్షాలు లేకపోతే మూడు కోట్లకు దగ్గరగా వెళ్ళేది
ఈ ఉత్సాహంతోనే హిందీ తమిళ వెర్షన్లు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్లో మే 5 గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేశారు. తమిళంలో 12న ఉంటుంది. కన్నడ మలయాళం డేట్లు ఒకటి రెండు రోజుల్లో డిసైడ్ చేస్తారు. అక్కడా ఇదే టాక్ తెచ్చుకుంటే మాత్రం అన్ని భాషలకు కలిపి వచ్చే ఫైనల్ ఫిగర్స్ షాకింగ్ గా ఉండటం ఖాయం. రాబోయే రోజుల్లో భారీగా చెప్పుకునే పోటీ లేదు. నాని దసరాలాగే కనీసం నెల పాటు నాన్ స్టాప్ రన్ ఖాయంగానే అనిపిస్తోంది. ఒకవేళ కస్టడీకి అదిరిపోయే టాక్ వస్తే అప్పుడు నెమ్మదిస్తుందేమో కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన టెన్షన్ అయితే ఏమి లేదు
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…