‘నాంది’ సినిమాతో ఇటు ప్రేక్షకులను, అటు ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచాడు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల. తొలి సినిమాకు సామాజిక అంశాలతో కూడిన ఒక సీరియస్ కథను ఎంచుకుని.. దాన్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్ది మంచి విజయాన్నందుకున్నాడు విజయ్.
అతడి రెండో సినిమా ఒక స్టార్ హీరోతో ఉండొచ్చని ప్రచారం జరిగింది. అక్కినేని నాగచైతన్యతో సినిమా కోసం కథా చర్చలు కూడా జరిపాడు విజయ్. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్‌తోనే ‘ఉగ్రం’ తీశాడు.
ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలతో పాటు నాగచైతన్యతో అనుకున్న సినిమా గురించి కూడా మీడియాతో మాట్లాడాడు విజయ్. చైతూ కోసం అనుకున్న కథ 80 శాతం ఓకే అయినా.. క్లైమాక్స్ విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమా ఆగిందన్నాడు విజయ్.
‘‘నాంది తర్వాత నాగచైతన్యతో సినిమా చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే. నేను తయారు చేసిన కథ ఆయనకు నచ్చింది. 80 శాతం వరకు ఓకే అన్నారు. కానీ పతాక సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. అలా అని ఆ కథను పక్కన పెట్టలేదు. దాని మీద పని చేస్తున్నాం. మార్పులు చేర్పులు చేస్తున్నాం. మిగతా కథతోనే మెప్పించి చైతూతో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నా. ‘ఉగ్రం’ సినిమా విషయానికి వస్తే.. ఇది ‘నాంది’ చేస్తుండగా.. లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్‌లో తయారు చేసిన కథ. వాస్తవ ఘటనలు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. ఇందుకోసం చాలామంది పోలీస్ అధికారులను కలిశాం. ఆరు నెలలు పరిశోధన జరిపాం. ‘నాంది’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కింది. ఆ స్థాయి ఉన్న కథ ఇది. ఇందులో నరేష్‌ను చూసి ప్రేక్షకులు షాకవుతారు. మరోసారి మేమిద్దరం కలిసి హిట్ కొడతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు విజయ్.
This post was last modified on April 30, 2023 9:48 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…