వర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌లది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బద్రి సినిమాలో వాళ్లిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి ఇచ్చిన పెర్ఫామెన్స్.. ఒకరితో ఒకరు తలపడే సన్నివేశాలను తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ తర్వాత కెమెరామన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ చిత్రాల్లోనూ వీరి కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జోడీని తెరపై చూడబోతున్నాం. పవన్ కొత్త సినిమా ఓజీలో ప్రకాష్ రాజ్‌కు కీలక పాత్ర దక్కడం విశేషం. ఆల్రెడీ ఈ విలక్షణ నటుడు ఆ సినిమా షూటింగ్‌కు కూడా హాజరవుతున్నాడట.
ముంబయిలో ఇటీవలే ఓజీ తొలి షెడ్యూల్ మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబయిలోనే ఉంటూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తాజాగా ప్రకాష్ రాజ్ సెట్లో అడుగు పెట్టినట్లు తెలిసింది. మరి సుజీత్ లాంటి ట్రెండీ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ కోసం ఎలాంటి పాత్ర డిజైన్ చేశాడు.. పవన్, ప్రకాష్ రాజ్ కాంబోలో వచ్చే సీన్లు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరం. తొలి దశలో పవన్ ఈ సినిమా కోసం కేటాయించిన డేట్లలో వీలైనన్ని ఎక్కువ సన్నివేశాలు తీయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌ది బహుశా విలన్ పాత్రే అయ్యుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యాక పవన్ మళ్లీ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం కొన్ని రోజులు పని చేస్తాడు. ఆ తర్వాత ఓజీ కోసం తిరిగొస్తాడు.
This post was last modified on April 29, 2023 6:13 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…