Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “సేవ్ ద టైగర్స్”

కావలసినంత కామెడీ, కోరుకున్నంత సెటైర్,  పదే పదే గుర్తొచ్చేంత ఫన్, ఊహలకు అందనంత డ్రామా.. అన్నీ కలిసిన ఒక సరికొత్త ఫ్లేవర్ ఉన్న కంటెంట్ ని అందిస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఆ సిరీస్ పేరు “సేవ్ ద టైగర్స్”.

ఇక్కడ టైగర్స్ అంటే గ్రీన్ జంగిల్స్ లో గాండ్రించే  టైగర్స్ కావు.. కాంక్రీట్ జంగిల్స్ లో కుయ్యోమొర్రో అనే టైగర్స్. భార్యల వల్ల బాధ పడే టైగర్స్. కథ లో విషయం అంతా ఈ లైన్ లో వుంది. చమత్కారం,వెటకారం అంతా ఈ కథలోనే దొరుకుతుంది. మూడు జంటల ఈ కథలో ఆరు ఎపిసోడ్స్ వున్న సీజన్ 1 ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభం అయింది.

ఫ్రస్ట్రేషన్ తో బాధిత భర్తలు ముగ్గురు కలిసి కలబోసుకునే విషయాలు, బాధలు, వేదనలు, ఆవేదనలు, ఒకరికి ఒకరి ఓదార్పులు  అన్నీ కలిసి ఒక సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.

ప్రముఖ నటులు ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో కనువిందు చేస్తున్న ఈ సిరీస్ తో నటుడు తేజ కాకుమాను దర్శకుడు అయ్యారు. ప్రదీప్ అద్వైతం దీనికి రచయిత. మహి వి రాఘవ్ ఈ సిరీస్ నిర్మాత. పావని గంగిరెడ్డి, హర్ష వర్ధన్, సుజాత కీలకమైన కేరక్టర్స్ లో అలరిస్తున్నారు. వేసవిలో చల్లని గాలిలా ఈ వినోదాన్ని ఆస్వాదించండి. మిస్ అవ్వకండి.

“సేవ్ ద టైగర్స్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3HcnzkM

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on April 28, 2023 8:58 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago