కావలసినంత కామెడీ, కోరుకున్నంత సెటైర్, పదే పదే గుర్తొచ్చేంత ఫన్, ఊహలకు అందనంత డ్రామా.. అన్నీ కలిసిన ఒక సరికొత్త ఫ్లేవర్ ఉన్న కంటెంట్ ని అందిస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఆ సిరీస్ పేరు “సేవ్ ద టైగర్స్”.
ఇక్కడ టైగర్స్ అంటే గ్రీన్ జంగిల్స్ లో గాండ్రించే టైగర్స్ కావు.. కాంక్రీట్ జంగిల్స్ లో కుయ్యోమొర్రో అనే టైగర్స్. భార్యల వల్ల బాధ పడే టైగర్స్. కథ లో విషయం అంతా ఈ లైన్ లో వుంది. చమత్కారం,వెటకారం అంతా ఈ కథలోనే దొరుకుతుంది. మూడు జంటల ఈ కథలో ఆరు ఎపిసోడ్స్ వున్న సీజన్ 1 ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభం అయింది.
ఫ్రస్ట్రేషన్ తో బాధిత భర్తలు ముగ్గురు కలిసి కలబోసుకునే విషయాలు, బాధలు, వేదనలు, ఆవేదనలు, ఒకరికి ఒకరి ఓదార్పులు అన్నీ కలిసి ఒక సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.
ప్రముఖ నటులు ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో కనువిందు చేస్తున్న ఈ సిరీస్ తో నటుడు తేజ కాకుమాను దర్శకుడు అయ్యారు. ప్రదీప్ అద్వైతం దీనికి రచయిత. మహి వి రాఘవ్ ఈ సిరీస్ నిర్మాత. పావని గంగిరెడ్డి, హర్ష వర్ధన్, సుజాత కీలకమైన కేరక్టర్స్ లో అలరిస్తున్నారు. వేసవిలో చల్లని గాలిలా ఈ వినోదాన్ని ఆస్వాదించండి. మిస్ అవ్వకండి.
“సేవ్ ద టైగర్స్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3HcnzkM
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates