తమిళంలో దర్శకుడు వెట్రిమారన్ కున్న పేరు తెలిసిందే. కేవలం ఈ బ్రాండ్ మీదే తెలుగులో విడుదల పార్ట్ 1ని మార్కెటింగ్ చేశారు. కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈయన రచనలో రాజ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ జల్లికట్టు నిన్నటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అరవింద్ బృందం ఇందులోని ప్రారంభ ఎపిసోడ్లను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఫ్యాన్స్ ప్రీమియర్ వేశారు. దీన్ని బట్టే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇది మెప్పించేలా సాగిందా.
ఆవులను నమ్ముకుని వాటి మీద బ్రతికే వెనుకబడిన జాతికి చెందిన ముత్తయ్య(కిషోర్)కు చేదోడువాదోడుగా మేనల్లుడు పాండు (కలైయారసన్)ఉంటాడు. వీళ్ళ కులాన్ని తక్కువగా చూసే తామర వర్గానికి చెందిన జమిందార్ సెల్వశేఖర్(వేల రాంమూర్తి) ఎద్దుని జల్లికట్టులో పాండు పట్టుకుని గెలుస్తాడు. ఆ మూగజీవం బావిలో పడి చనిపోతుంది. ఇది అవమానంగా భావించిన సెల్వ అనుచరులు పాండుని హత్య చేస్తారు. ఇక్కడి నుంచి పగలు ప్రతీకారాలు తిరిగి మొదలవుతాయి. పాండు మరణం రెండూళ్ల మధ్య చిచ్చు రేపుతుంది. అసలైన కథ ఇక్కడి నుంచే చూడాలి.
ఎప్పుడూ అణిచివేత తిరుగుబాటుని బ్యాక్ డ్రాప్ గా తీసుకునే వెట్రిమారన్ ఈ జల్లికట్టులోనూ అదే చేశారు. పేరుకి రాజ్ కుమార్ దర్శకుడైనా ప్రతి ఫ్రేమ్ లో అతని గురువు ముద్ర కనిపిస్తుంది. సిరీస్ కావడంతో అవసరానికి మించిన ల్యాగ్ మధ్యలో వచ్చినప్పటికీ నారప్ప, ధనుష్ కర్ణన్ తరహా నేపధ్యాన్ని ఇష్టపడేవాళ్ళకు జల్లికట్టు ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తుంది కానీ మిగిలినవాళ్లు ఫార్వార్డ్ చేయకుండా చూడటం కష్టం. ఆర్టిస్టులు బాగా కుదిరారు. ఇదే బ్యాక్ డ్రాప్ లో స్టార్ హీరో సూర్యతో వడివాసల్ తీస్తున్న వెట్రిమారన్ అందులో ఎలాంటి వైవిధ్యం చూపిస్తారో.
This post was last modified on April 27, 2023 2:01 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…