రేపు బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన పోరుకి తెరలేవనుంది. రెండు ఏ మాత్రం సంబంధం లేని జానర్లు భారీ బడ్జెట్ తో రూపొంది అభిమానుల విపరీతమైన అంచనాల మధ్య థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. అఖిల్ ఏజెంట్ ప్రమోషన్లు గత పదిరోజులుగా అగ్రెసివ్ గా జరుగుతున్నాయి. నలభై కోట్లకు దగ్గరగా వెళ్తేనే లాభాల్లోకి అడుగు పెట్టినట్టు అవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమీ కష్టం కాదు. బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగు పెట్టిన విరూపాక్ష తప్ప ఇంకేవి స్ట్రాంగ్ గా లేవు. టాక్ కనక బాగుంటే ఏజెంట్ కి వసూళ్ల వర్షం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది.
తొలుత ఏజెంట్ ని ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ ప్రస్తుతానికి తెలుగు మలయాళం వెర్షన్లకు మాత్రమే పరిమితమయ్యారు. మమ్ముట్టి ఉన్నా కేరళలో పోటీ వల్ల లిమిటెడ్ స్క్రీన్లు దక్కడంతో అవి పెరిగే విషయంలో టాక్ కీలక పాత్ర పోషించనుంది. పూర్తి తమిళ వాసనలతో మల్టీ స్టారర్ గా రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 2కి దిల్ రాజు పుణ్యమాని చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అంతో ఇంతో నగరాల్లో తప్ప మిగిలిన చోట్ల బాగా చాలా నీరసంగా ఉన్నాయి. ఏదో బాహుబలి రేంజ్ టాక్ వస్తే తప్ప జనం కదిలేలా లేరు.
చెప్పాలంటే ఇది తెలుగు గన్నుతో తమిళ కత్తి యుద్ధం చేస్తున్నట్టు ఉంది. అయితే ఏజెంట్ ఓవర్సీస్ ప్రింట్ల విషయంలో జరుగుతున్న జాప్యం ప్రీమియర్లను ఆలస్యం చేసే అవకాశముంది. నిర్మాత అనిల్ సుంకర ఏపీ తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే షోలు పడేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఆ మేరకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. దర్శకుడు సురేందర్ రెడ్డికి దీని సక్సెస్ చాలా కీలకం. ఎంత కష్టపడినా సైరా నరసింహారెడ్డికి ఆశించిన ఫలితం దక్కపోవడంతో ఎలాగైనా ఏజెంట్ తో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని కసిమీదున్నాడు. విజేత ఎవరో రేపు తేలిపోతుంది.
This post was last modified on April 27, 2023 10:01 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…