Movie News

ఆదిపురుష్ ఫేట్ తేలేది ఆ రోజే..


టీజర్లు, ట్రైలర్ల వల్ల కొన్ని సినిమాలకు బాగా కలిసొస్తుంటుంది. విడుదల ముంగిట సినిమాకు హైప్ పెరగడానికి అవి పనికొస్తుంటాయి. అదే సమయంలో టీజర్, ట్రైలర్ బాలేకుంటే సీన్ రివర్సవుతుంది. ఉన్న హైప్ కూడా పోతుంది. సినిమా రిజల్ట్ మీదే అది ప్రభావం చూపొచ్చు. ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో రెండోదే జరిగేలా కనిపించింది. గత ఏడాది రిలీజైన ఆ సినిమా టీజర్ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

రామాయణానికి సంబంధించి మన ఊహల్లో ఉన్న దానికి భిన్నంగా ప్రధాన పాత్రలు కనిపించడం.. అలాగే చాలా కృత్రిమంగా అనిపించిన గ్రాఫిక్స్.. సినిమా మీద విపరీతమైన ట్రోలింగ్‌కు కారణం అయ్యాయి. టెక్నాలజీ ఈ సినిమాకు బలం కాకపోగా.. పెద్ద బలహీనతగా మారింది. చరిత్రలో ఇంత వరకు ఒక టీజర్ వల్ల ఏ సినిమాకూ జరగని డ్యామేజ్ ఈ చిత్రానికి జరిగింది. అది ఏ స్థాయిలో అంటే.. సినిమాను ఆరు నెలలు వాయిదా వేసుకుని మళ్లీ గ్రాఫిక్స్, ఇతర విషయాల మీద కరెక్షన్లకు కూర్చునేంత.

మొత్తానికి చెయ్యాల్సిన కరెక్షన్లేవో చేశారు. అనుకున్న ప్రకారమే జూన్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని పోస్టర్లు, అలాగే పాటలు రిలీజ్ చేసి ప్రమోషన్లు మొదలుపెట్టారు. కానీ వీటి మీద కంటే ట్రైలర్ మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. అదెలా ఉంటుందన్న దాన్ని బట్టి సినిమా మీద జనాలు ఒక అంచనాకు రాబోతున్నారు.

ప్రభాస్ అభిమానులతో సహా అందరూ టీజర్‌ లాగా కాకుండా ఈసారి పాజిటివ్ ఫీల్ ఇచ్చేలా ట్రైలర్ ఉండాలని కోరుకుంటున్నారు. ఓం రౌత్ అండ్ టీం విడుదలకు నెల రోజుల ముందే ట్రైలర్ లాంచ్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం మంచి ముహూర్తం చూస్తున్నారు. మే 4 లేదా 17న ట్రైలర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ట్రైలర్ సిద్ధమైందట. దాని నిడివి 3 నిమిషాల 22 సెకన్లు అని తెలిసింది. ఈ ట్రైలర్ ఏ రోజు రిలీజైతే ఆ రోజు ‘ఆదిపురుష్’ ఫేట్ ఏంటి అన్నది తేలిపోతుంది అనడంలో సందేహం లేదు.

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

10 minutes ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

32 minutes ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

1 hour ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

1 hour ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

2 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago