ఇంకో మూడు నెలల్లో రాబోతున్న ఆగస్ట్ స్వతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసుకుని పలు సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 11 తేదీకి చిరంజీవి భోళా శంకర్ ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ అయ్యింది. దర్శకుడు మెహర్ రమేష్ గ్యాప్ లేకుండా మెగాస్టార్ సహకారంతో షూటింగ్ ని వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ఒక ఐటెం సాంగ్ పెడదామన్న ఆలోచనకు చిరు నుంచి ఇంకా అంగీకారం రాలేదని అది కూడా ఓకే అయితే అందులో ఎవరైనా బాలీవుడ్ బ్యూటీ లేదా శ్రేయలాంటి సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలన్న ప్లానింగ్ ఉందట.
ఇదిలా ఉండగా అదే డేట్ కి కర్చీఫ్ వేసుకున్న రజనీకాంత్ జైలర్ ఇప్పుడా బరి నుంచి తప్పుకుంది. ఇది ఖరారు చేసుకున్నాకే శివ కార్తికేయన్ మహావీరుడు అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సూపర్ స్టార్ దీపావళి వైపు చూస్తున్నారని చెన్నై టాక్. మరోవైపు సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ ల అనిమల్ 11 రావడం ఖాయమే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వచ్చే నెల నుంచి భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయొలెంట్ డ్రామాని అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా రేంజ్ లో సిద్ధం చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2ని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 11 విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ ఆల్రెడీ బిజినెస్ డీల్స్ కూడా చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు థియేటర్లు బ్లాక్ చేయడం లాంటివి జరుగుతున్నాయని సమాచారం. ఇదే బ్యానర్ లో రాబోయే మహేష్ బాబు 28తో పాటు టిల్లుకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు పెద్ద మొత్తాలే ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. ఇవి కాకుండా సన్నీ డియోల్ గదర్ 2 కూడా బరిలో ఉంది. చూస్తుంటే ఇండిపెండెన్స్ డేకి భారీ క్లాష్ తప్పేలా లేదు.
This post was last modified on April 24, 2023 5:58 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…