అక్కినేని అఖిల్ హీరోగా అతని మార్కెట్ ను మించి ఖర్చు పెట్టి తీసిన భారీ సినిమా ‘ఏజెంట్’ ఈ నెల 28న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఉన్నపలంగా ఫిక్స్ చేసుకోవడంతో హడావిడిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు అఖిల్. ఎక్కువ టైమ్ లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ ను వాయిదా వేసుకొని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ పాల్గొన్న ప్రతీ సారి షూటింగ్ డిలే , ఓవర్ బడ్జెట్ అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి.
ఈ క్వశ్చన్స్ విన్న ప్రతీ సారి కొద్దిగా ఇరిటేట్ అవుతున్నాడు అఖిల్. వెళ్ళిన ప్రతీ చోట అఖిల్ కి షూటింగ్ ఆలస్యం అనే ప్రశ్న వింటుంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. తాజాగా కూడా ఆ ప్రశ్న కి ఇరిటేషన్ గా ఫీలయ్యాడు అఖిల్. డిలే అండొద్దు. ఈ మాత్రం షూటింగ్ డేస్ అవుతాయి. అయినా మేము ఘాట్ చేసింది కేవలం 105 రోజులే అంటూ ఏదో లెక్క చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అవన్నీ చెప్పలేక అఖిల్ ఇలా కవర్ చేసుకుంటున్నాడు.
ఇక తన సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ , చరణ్ వస్తున్నారా ? అనే ప్రశ్నకి అఖిల్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. ట్రైలర్ చూసి ఫోన్ లో ఇద్దరు మాట్లాడారని ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్పాడు. ఇక నాగ్ వందో సినిమాలో తను కూడా యాక్ట్ చేస్తున్న విషయంపై కూడా అఖిల్ రియాక్ట్ అవుతూ ఇంకా దానికి స్క్రిప్ట్ రెడీ అవ్వలేదని , స్క్రిప్ట్ రెడీ అయితే తమే ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. మా కాంబో సినిమా అంటే ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండాలని అలా ఉంటేనే చేస్తామని తెలిపాడు.
This post was last modified on April 23, 2023 7:49 am
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…