Movie News

విరూపాక్ష మ్యాజిక్ మొద‌లైంది..

మార్చి నెలాఖ‌ర్లో ద‌స‌రా సంద‌డి త‌ర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డ‌ల్లుగానే న‌డుస్తోంది. రావ‌ణాసుర‌, మీట‌ర్, శాకుంత‌లం.. ఇలా ఏ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. రావ‌ణాసుర చిత్రానికి ఓ మోస్త‌రుగా ఓపెనింగ్స్ అయినా వ‌చ్చాయి కానీ.. మిగ‌తా సినిమాల ప‌రిస్థితి దారుణం.

సినిమాల‌కు బాగా క‌లిసొచ్చే వేస‌వి సీజ‌న్లో ఈ స్లంప్ ఏంట‌ని టాలీవుడ్ కంగారు ప‌డిపోయింది. దీనికి తోడు ఈ శుక్ర‌వారానికి షెడ్యూల్ అయిన కొత్త సినిమా విరూపాక్ష‌కు కూడా ఏమంత పాజిటివ్ హైప్ క‌నిపించ‌లేదు. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే డ‌ల్లుగానే ఉన్నాయి. ఒక‌ప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాల‌కు ఈజీగా తొలి రోజు ఫుల్స్ ప‌డిపోయేవి కానీ.. ఈ సినిమాకు ఆ ప‌రిస్థితి లేదు. శుక్ర‌వారం మార్నింగ్ షోల‌కు అక్యుపెన్సీ త‌క్కువ‌గా క‌నిపించింది.

ఐతే తొలి రోజు సాయంత్రానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ విరూపాక్ష మ్యాజిక్ మొద‌లైంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ సినిమాకు బాగానే క‌లిసొచ్చాయి. అంద‌రూ మంచి సినిమా అని చెబుతుండేస‌రికి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగిపోయింది. సాయంత్రానికి ఒక్క‌సారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. హైద‌రాబాద్ లాంటి సిటీల్లో చాలా థియేట‌ర్ల‌లో హౌస్ ఫుల్స్ ప‌డిపోయాయి. ఈ రోజుల్లో సినిమా యావ‌రేజ్ అంటే ఆలోచిస్తారు కానీ.. అంద‌రూ బాగుంది అంటే ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డ‌తారు.

అందులోనూ కొన్ని వారాలుగా స‌రైన సినిమా లేక‌పోవ‌డం కూడా విరూపాక్ష వైపు మ‌ళ్ల‌డానికి దోహ‌ద ప‌డుతోంది. తేజు మీద సానుకూల‌త‌, సానుభూతి ఉండ‌టం కూడా సినిమాకు క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నారు. శ‌ని, ఆదివారాల్లో సినిమాకు మరింత మంచి వ‌సూళ్లు వస్తాయ‌ని.. హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రానికి అత‌డి గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.

This post was last modified on April 22, 2023 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

20 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

51 minutes ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

51 minutes ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

2 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

4 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

4 hours ago